Saturday, 7 November 2020

‘పూజా హెగ్డే.. హీరోలు, దర్శకులకు అనుకూలవతి.. ఆమె తొడలు, బొడ్డు అంటే అబ్సెషన్, అందుకే ఆఫర్లు’.. సంచలన కామెంట్స్

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఈ పొరుగు రాష్ట్రాల ఆరబోత అందగత్తెలకు కొత్తేం కాదు.. అందం, అభినయం అన్నీ ఉన్నా మన తెలుగు హీరోయిన్లు అంటే మన దర్శక నిర్మాతలకు ఎందుకో చిన్న చూపు. ముంబై భామలన్నా.. పక్కరాష్ట్రాల తెల్లతోలు ముద్దుగుమ్మలన్నా మనోళ్లకి ఎక్కడ లేని మోజు, కసి. అందుకే తెలుగు అక్షరం ముక్క రాకపోయిన తెలుగు సినిమాలకు క్వీన్‌లను చేస్తుంటారు. నెత్తిన ఎక్కించుకుంటున్నారు. ఎంతైనా పొరుగింటి పిల్ల కదా.. తెలుగింటి భోజనం తిన్న విశ్వాసం ఎక్కువ కాలం ఉంచుకోరు.. ఇది మాదిరి లోపల ఉన్నది కక్కేస్తూ ఉంటారు. పక్క రాష్ట్రం హీరోయిన్ అయినా.. ఆ కీర్తి సురేష్, అనుష్కల మాదిరి యాక్టింగ్‌లో సూపర్ అనడానికి లేదు.. ఉన్నానంటే ఉన్నాను.. వెళ్లానంటే వెళ్లాను అన్నట్టు లెక్క. కానీ ఆమెకు వరుస సినిమాలు అవి కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన. ఓ అలవైకుంఠపురం.. ఓ మహర్షి.. అరవింద సమేత.. త్వరలో రాధేశ్యామ్ ఇలా మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీలే కాదు.. నాగచైతన్య, అఖిల్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ (జిగేల్ రాణి ఐటమ్ సాంగ్)లతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అయితే ఇన్ని సినిమాలు చేసినా.. వారెవ్వా ఏం నటించిందిరా అనడానికి ఒక్కటంటే ఒక్క సినిమా లేదు.. కానీ ఏం చూపించిందిరా అనడానికి ప్రతి సినిమా ఉంది. ఆమె భాషలో చెప్పాలంటే ఫేస్ కంటే తొడలు, బొడ్డు చూపించడమే ఎక్కువ. ఆ డీజే సినిమాలో అయితే శరీరాన్ని మొత్తం ఒక్కటే పీస్‌తో సరిపెట్టుకుంది. మొత్తానికి మన తెలుగు దర్శకుల వీక్‌ నెస్‌ని బాగా క్యాష్ చేసుకున్న పూజా హెగ్డే.. దక్షణాది ప్రేక్షకులపై నోరు పారేసుకుంది. ఇక్కడ ప్రేక్షకులకు నాభి, నడుము, తొడలు భాగం అంటే బాగా ఇష్టపడతారని అల వైకుంఠపురములో కాళ్లను హైలట్ చేసి చూపించడం కూడా దీని భాగమే అని అన్నారు. ఈ సినిమాలో హీరోకి హీరోయిన్ కాళ్లు అంటే ఇష్టమని అందుకే తొడల్ని ఎక్కువగా చూపించారని.. అయితే అతని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ నీతులు చెప్పిన సీన్లు కూడా ఉన్నాయని కానీ ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా కేవలం తొడలనే హైలైట్ చేసి మాట్లాడుకున్నారంటూ తన అంగాంగ ప్రదర్శనను సిగ్గులేకుండా సమర్ధించుకుంది. నీ కాళ్లని పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ ఆమె కాళ్లని నెత్తిన పెట్టుకుంటే... ఆ నగ్నకాళ్లతోనే తిరిగి తన్నుతోంది పూజా. దక్షణాది ప్రేక్షకులపై పూజా హెగ్డే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆమెకు క్యారెక్టర్‌పై ఓపెన్ కామెంట్ చేస్తూ ఫేస్‌ బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ‘అవును... పూజా హెగ్డే చెప్పింది నిజమే కదా! మనకి తొడలు, బొడ్డు అంటే అబ్సెషన్ కదా!! దానికి సిగ్గెందుకూ? పూజా హెగ్డేని మాత్రం ఆవిడ భీభత్సమైన నటన చూసా మన దర్శకులు రిపీట్ చేస్తోంది? ఎదో చూడ్డానికి బొంబాయి మోడల్ లా ఉంటుంది. రూపవతి పైగా అనుకూలవతి మరియు గగనజఘనవతి అనేకదా?!?’ అంటూ ఆమెపై క్యారెక్టర్‌పై సంచలన పోస్ట్‌ని షేర్ చేశాడు . అయితే మహేష్ కత్తి కామెంట్‌పై బీవీఎస్ రవి స్పందిస్తూ వాట్ ది హెల్ అనుకూలవతి అని ప్రశ్నించగా.. హీరోలకు దర్శకులకు అనుగుణంగా నడిచే హీరోయిన్ ని అనుకూలవతి అనడం కరెక్టే కదా గురువు గారూ! అంటూ సమర్ధించుకున్నాడు కత్తి మహేష్. ఇక మరో నెటిజన్ అనుకూలవతి అంటే ఏంటి?? అని ప్రశ్నించగా.. ‘పూజా హెగ్డేని సైన్ చేసే బడ్జెట్ ఉంటే చెప్పు. అప్పుడు అర్ధం చెబుతా!’ అంటూ ద్వందార్థంతో కూడా రిప్లై ఇచ్చారు కత్తి మహేష్. ఇంతకీ రూపవతి, అనుకూలవతి ఓకే.. ఇంతకీ గగనజఘనవతి అంటే ఏంటోయ్ అంటే.. ‘గగన జఘనంలో గగనం అంటే ఆకాశం..ఆకాశం అంటే శూన్యం ..శూన్యం అంటే లేనిది అని ...అంటే నడుము లేనిది అని కవి భావన’ అంటూ కత్తి మహేష్ పోస్ట్ చర్చలకు తావిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3571T6J

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....