Tuesday 17 November 2020

వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని లేడీ సూపర్‌స్టార్.. హ్యాపీ బర్త్‌డే నయన్

హీరోయిన్‌గా ఐదేళ్లు, పదేళ్లు కొనసాగితే గొప్ప విషయంగా చెప్పుకుంటారు. కానీ మలయాళీ ముద్దుగుమ్ము రూటే సెపరేటు. 36ఏళ్ల వయసొచ్చినా కుర్ర హీరోయిన్లతో పోటీపడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకత. టాప్ హీరోలు, యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా కథకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. చీరకట్టులో సంప్రదాయంగా కనిపించినా... స్విమ్ సూటులో అందాలు ఆరబోసినా నయనతారకే చెల్లుతుంది. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో వివాదాలు, ప్రేమాయణాలతో చిక్కుల్లో పడిన నయనతార.. ఆ తర్వాత వాటన్నింటికీ స్వస్తి పలికి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. లేడీ సూపర్‌స్టార్‌గా‌ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న నయనతార పుట్టినరోజు నేడు(నవంబర్ 18). ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాం. Also Read: 1984 నవంబరు 18 బెంగళూరులో జన్మించిన నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. వీరిని మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, తండ్రి వైమానిక దళంలో పనిచేయడంతో ఆమె విద్యాభాసం ఎక్కువగా ఉత్తరాతి రాష్ట్రాల్లోనే కొనసాగింది. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అవ్వాలనేది కోరికట. కాలేజీలో చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేసిన నయన్.. ఆ తర్వాత ఓ చానల్‌లో యాంకర్‌గా పనిచేశారు. ఓ కార్యక్రమంలోనే నయనతారను చూసిన మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ‘మనస్సినక్కరే’ (2003) సినిమాలో కీలక పాత్ర చేయమని అడిగితే సినిమాల్లో నటించడం తనకిష్టం లేదని చెప్పేశారట. ఆయన ఒత్తిడి మేరకు ఈ ఒక్క సినిమాలోనే నటిస్తానని షరతు విధించి ఒకే చెప్పారట. Also Read: ఆ సినిమా రిలీజ్ సమయంలో దర్శకుడు సత్యన్.. ఆమె పేరును మారిస్తే బాగుంటుందని అలోచించి అదే విషయాన్ని హీరో జయరామ్‌తో పాటు యూనిట్ సభ్యులకు చెప్పారట. దీంతో వారంతా కలిసి డయానా పేరును నయనతారగా మార్చారట. ‘మనస్సినక్కరే’ సినిమా ఘన విజయం సాధించడంతో నయనతార పేరు మార్మోగిపోయింది. ఆ క్రేజ్‌తో రెండేళ్లలోనే ఏకంగా 8 సినిమాల్లో నటించింది. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’, ‘గజినీ’ సినిమాలు నయన్‌కు ఎంతో పేరు తీసుకువచ్చాయి. 2006లో వెంకటేష్‌ సరసన ‘లక్ష్మీ’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసి’ తదితర సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ హోదా తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తో పాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకుని అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. ‘శ్రీరామ రాజ్యం’లో సీత పాత్ర ఆమెకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. అనంతరం ‘డోరా’, ‘ఐరా’, ‘కర్తవ్యం’ తదితర లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తాజాగా ఆమె నటించిన ‘అమ్మోరు తల్లి’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. దేవతగా నయనతార కనబరిని అభినయం ప్రేక్షకులను మైమరపిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్‌ ఆరంభంలో నయనతార తమిళ హీరో శింబుతో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనకు బ్రేకప్ చెప్పేసి ప్రభుదేవాకు దగ్గరయ్యారు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్యకు విడాకులిచ్చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ వీరిద్దరూ విడిపోయారు. కొంతకాలంగా దర్శకుడు విఘ్నేశ్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు సమాచారం. ఇటీవలే ప్రియుడి ప్రియుడితో కలిసి గోవాలో ఎంజాయ్ చేసిన నయనతార అతడి బర్త్‌డే వేడుకల కోసం ఏకంగా రూ.25లక్షలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. కెరీర్‌ పరంగా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని.. ఆ తర్వాతే వివాహం చేసుకుంటామని విఘ్నేశ్. నయనతార ఇటీవలే తెలిపారు. మరి 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న నయనతార పెళ్లిపీటలెప్పుడు ఎక్కుతుందో చూడాలి మరి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pE1yRh

No comments:

Post a Comment

'Young Desi Men May Vote For Trump'

'One of the big findings is that younger men seem to have shifted towards the Republican Party.' from rediff Top Interviews https:...