Sunday 1 November 2020

వేణు మాధవ్ మృతికి అసలు కారణాలివే.. వాళ్లే టార్గెట్ చేశారంటూ ఏడాది గడిచాక ఓపెన్ అయిన తనయులు

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ కమెడియన్ ఉన్నట్టుండి మన మధ్య నుంచి వెళ్లిపోయారు. గతేడాది సెప్టెంబర్ 25వ తేదీన ఆయన కన్నుమూశారు. కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు మాధవ్ భార్య, ఇద్దరు తనయులు ఆయన మృతికి గల కారణాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. వేణు మాధవ్ మృతికి ముందునుంచే ఆయన ఆరోగ్యంపై అనేక రూమర్స్ షికారు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తాగుడు, స్మోకింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి చనిపోయారనే టాక్ వచ్చింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన వేణు మాధవ్ కుమారులు సావికర్, ప్రభాకర్.. అవన్నీ రూమర్స్ అని, అలా స్ప్రెడ్ చేయడానికి ప్రత్యర్థి పొలిటికల్ నాయకులే కారణమని అన్నారు. పొలిటికల్ వే లోనే టార్గెట్ చేశారు గానీ సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు. Also Read: నాన్నగారు ఇంట్లో చాలా ఆనందంగా ఉండేవారని చెప్పిన వేణు మాధవ్ తనయులు.. వెండితెరపై కంటే ఇంట్లోనే ఎక్కువ ఫన్ ఉండేదని చెబుతూ ఆయన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. నాన్నగారికి డ్రింక్ అలవాటు ఉండేది కానీ, ఆయన మరణానికి అది కారణం కాదని అన్నారు. డైట్ విషయంలో ఎక్కువ కంట్రోల్ తీసుకోవడం, అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చినా ఆసుపత్రికి వెళ్లకపోవడంతో ఆయన ఊపిరితిత్తులు చెడిపోయి మరణానికి కారణమయ్యాయని తెలిపారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో వేణు మాధవ్ భార్య శ్రీవాణి మాట్లాడుతూ.. తన భర్త కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. పార్టీ ఏదైనా సరే అవకాశం వస్తే పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని, వేణు మాధవ్ కోరిక కూడా అదే అని తెలిపారు. ఆయన మరణం తర్వాత చంద్రబాబు, చిరంజీవి సహా చాలామంది ఇండస్ట్రీ పెద్దలు తమ కుటుంబానికి ధైర్యం చెప్పారని అన్నారు. Also Read: మొదట టీడీపీ ఆఫీసులో పని చేసిన వేణు మాధవ్.. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగారు. అదే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో కూడా అలరించిన వేణు మాధవ్ ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నారు. ఆయన అకాల మరణం యావత్ తెలుగు ప్రజలను ఎంతగానో బాధ పెట్టింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oFBC7k

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...