Sunday 15 November 2020

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటుడు సౌమిత్ర చటర్జీ కన్నుమూత

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పలువురు సినీ కళాకారులను కోల్పోతోంది ఇండస్ట్రీ. ఇటీవలే లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యం కరోనాతో కన్నుమూయగా.. నేడు (ఆదివారం) ప్రముఖ బెంగాల్ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ (85) కరోనాతో కన్నుమూశారు. కొంత కాలం క్రితం సౌమిత్ర ఛటర్జీకి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ణారణ అయింది. అప్పటి నుంచి ఆయన కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్నారు. క్రమంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. బెంగాలి తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన .. పలు బెంగాలీ సినిమాలతో అక్కడి వారికి ఆరాధ్య నటుడు అయ్యారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు ప్రేక్షకులను అలరించారు. సత్యజిత్‌ రాయ్ సినిమా ‘అపుర్ సంసార్’తో కెరీర్ ప్రారంభించిన ఆయన ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ చిత్ర సీమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 2012 సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. బెంగాలీ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌమిత్రా.. 1935 జనవరి 19న జన్మించారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకొని బెంగాలీ చిత్రసీమలో నెంబర్ వన్ నటుడిగా ఎదిగారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IyaKWl

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...