Sunday, 1 November 2020

Bigg Boss Memes: నాగార్జున గారో మగాళ్లతోనేనా సోషల్ డిస్టెన్స్.. అమ్మాయిలతో డిస్టెన్స్ అవసరం లేదా? ట్రోలింగ్ మామూలుగా లేదు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఆరుపదులు వయసు దాటినా చాలామంది అమ్మాయిలకు ఇంకా నవ మన్మథుడే. అఖిల్, నాగ చైతన్యలకు లేని లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ నాగార్జునకు సొంతమైంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మన్మథుడిగానే అమ్మాయిల గుండెల్లో గూడు కట్టుకున్నారు టాలీవుడ్ కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. వెండితెరపై నవ మన్మథుడిగా వెలుగు వెలిగిన నాగ్.. బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. అప్పట్లో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ టీవీ హోస్ట్‌గానూ కింగ్ అనిపించిన నాగార్జున.. బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4లకు హోస్ట్ చేస్తున్నారు. కాగా సీజన్ 4లో పెద్దగా పస లేకపోవడంతో జనానికి కావాల్సిన వినోదాన్ని పంచలేకపోతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక, వాళ్ల పెర్ఫామెన్స్, ఎలిమినేషన్స్, లవ్ ట్రాక్ ఇలా ప్రతి విషయంలోనూ బిగ్ బాస్ షోపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో నాగార్జున హోస్టింగ్‌పై కూడా విమర్శలతో పాటు ట్రోలింగ్స్‌ కూడా వస్తున్నాయి. కాదేదీ ట్రోలింగ్‌కి అనర్హం అన్నట్టుగా ఇటీవల నోయల్ ఎలిమినేషన్ సందర్భంగా నాగార్జున కరోనా పరస్థితిలో నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ అంటూ బిగ్ బాస్ స్టేజ్‌పై నోయల్‌తో చేయి కలిపి వెంటనే దూరంగా ఉన్నారు నాగార్జున. ఈ సందర్భంగా.. ‘నోయల్ నీకు దూరంగా ఎందుకు ఉంటున్నా అంటే.. నేను ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చా... సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించి సోషల్ డిస్టెన్స్ అనేశారు. ఆయన అలా అనడానికి కారణం లేకపోలేదు. వైల్డ్ డాగ్ షూటింగ్ సందర్భంగా కులిమనాలి వెళ్లి తిరిగి వచ్చారు నాగార్జున. ఈ సందర్భంగా తాను బయటకి వెళ్లిరావడం వల్ల సోషల్ డిస్టెన్స్ అవసరం అని.. అందుకే దూరంగా ఉండి మాట్లాడదాం అని నోయల్‌తో బిగ్ బాస్ స్టేజ్‌పై చెప్పారు నాగార్జున. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఎనిమిదో వారంలో దివి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్‌కి సమంత హోస్ట్‌గా వ్యవహరించింది. నాగార్జున లేని టైంలో బిగ్ బాస్ హౌస్‌ని బయటకు వచ్చిన దివి.. తాజాగా నాగార్జున కలిసింది. ఈ సందర్భంగా నాగార్జున-దివిలు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ ఫొటోలో నాగార్జున-దివి ఇద్దరూ దగ్గరా ఉండటమే కాకుండా.. దివి భుజంపై చేసి వేసి మరీ ఫొటోకి పోజులు ఇచ్చారు నాగార్జున. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగార్జున సోషల్ డిస్టెన్స్ మగాళ్లతోనేనా?? ఆడవాళ్లతో అవసరం లేదా?? నోయల్‌తో అయితే సోషల్ డిస్టెన్స్ అన్నారు.. దివితో అయితే దగ్గరగా ఉండి ఫొటో దిగడమే కాకుండా ఆమె భుజంపై చేయి వేసి ఫొటో దిగారు.. ఎంతైనా నాగార్జున నవ మన్మథుడు అనడానికి ఈ ఫొటోనే నిదర్శనం అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/381xloV

No comments:

Post a Comment

'After Aradhana, People Took Me Seriously'

'Everybody was scared, especially with Rajesh Khanna playing a double role and playing my lover and my son.' from rediff Top Inter...