
దక్షిణాది సినీనటి , నటుడు, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ దర్శన్ ప్రేమ వ్యవహారం కేసుల వరకు వెళ్లింది. దర్శన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడండూ ఆమె కొద్దిరోజుల క్రితం చెన్నైలోని అడయార్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు దర్శన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్శన్, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతడితో కలిసి ఏడాది పాటు తిరిగామని సనంశెట్టి తెలిపింది. అయితే దర్శన్ సడెన్‌గా తనతో మాట్లాడటం మానేశాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసిన దర్శన్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో సనంశెట్టి నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్శన్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కథ ఎక్కడికి వెళ్తుందో చూడాలి మరి. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ssnb7V
No comments:
Post a Comment