
కరోనా వైరస్ బారిన పడిన హీరో ఆరోగ్యంపై అందరిలోనూ ఆందోళన నెలకొంది. తన కుటుంబంలో అందరికీ కరోనా సోకిందని కొద్దిరోజుల క్రితం రాజశేఖర్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఆ వెంటనే కుమార్తెలు శివాత్మిక, శివానీ కోలుకోగా.. కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత జీవిత డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్ చేస్తూ నాన్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్థనలు చేయాలంటూ ట్వీట్ చేశారు.
ఆ వెంటనే రాజశేఖర్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ యాజమాన్యం బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శివాత్మిక ట్వీట్‌కు స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ‘ప్రియమైన శివత్మికా మీ ప్రేమగల నాన్న, నా సహనటుడు, స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన కోసం అలాగే మీ కుటుంబం కోసం నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. Also Read: తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక గురువారం రాత్రి మరో ట్వీట్ చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మీ ప్రేమ, ఆప్యాయతను చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నాన్న ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది శివాత్మిక. ఆమె ట్వీట్ చూస్తుంటే రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jrvWKd
No comments:
Post a Comment