
శ్రియా శరణ్ ప్రధాన పాత్ర పోషించిన పాన్ ఇండియా మూవీ ‘’. నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా సుజనా రావు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రియల్ లైఫ్ డ్రామా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రియ, నిత్యా మీనన్ లుక్స్‌ను విడుదల చేశారు. ఇప్పుడు మరో రెండు పాత్రలను పరిచయం చేశారు. చిత్రంలో యువ జంట అలీ, జారా పాత్రలను పోషించిన శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. వైట్ జెర్సీలో క్రికెటర్‌గా శివ కనిపిస్తుండగా, సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన ముస్లిం అమ్మాయిగా ప్రియాంక దర్శనమిస్తున్నారు. పోస్టర్ ప్రకారం, ఆ జంట అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీని తెరపై మనం చూడనున్నామనే అభిప్రాయం కలుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన శ్రియా శరన్, నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్వితీయమైన స్పందన లభించిన విషయం విదితమే. ఇప్పుడు శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ జోడి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో డబుల్ ధమాకా అందించింది చిత్ర బృందం. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయారాజా సంగీత సమకూరుస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఒకవైపు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే.. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గమనం’ షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3leAYLD
No comments:
Post a Comment