Monday, 5 October 2020

ఆడదాని ప్రైవేట్ పార్ట్స్ కట్.. దేశంలో ఏంటీ ఖర్మ! పోలీస్ వ్యవస్థపై పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా, మానవత్వం మంటగలిసేలా మనిషే ఓ మృగంలా మారిపోతున్నాడు. ఓ దుర్ఘటన తాలూకు విషయాలు మరువక ముందే మరో దుర్ఘటన గురించి వినాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంటోంది. పటిష్టమైన పోలీస్, న్యాయ వ్యవస్థ ఉందని చెప్పుకునే ఈ దేశంలో పట్టపగలే అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్‌లో జరిగిన ఘటనతో దేశంలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో తాజాగా అలాంటి వాటిని ఖండిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు డాషింగ్ డైరెక్టర్ . నగ్నంగా నిజాలు మాట్లాడుకుందాం: ఒక్కసారి అందరం బట్టలిప్పి నగ్నంగా నిజాలు మాట్లాడుకుందాం అంటూ ఓ వీడియో ద్వారా షాకింగ్ కామెంట్స్ చేశారు. ''ఇండియాలో ప్రతి పావుగంటకు ఓ రేప్ జరుగుతోంది. ప్రతి రోజు వంద రేప్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. రోజుకు నాలుగు లక్షలపైగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే హాథ్రస్‌లో సామూహిక అత్యాచారం. వాళ్లు అత్యాచారం చేయడం మాత్రమే కాదు.. అతి కిరాతంగా హింసించారు. ఆడదానికి అన్యాయం జరిగితే న్యాయం జరగడం పక్కన పెట్టండి.. న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోంది ఈ దేశంలో.. ఏంటీ ఖర్మ! ఆడవాళ్లే ఫైట్‌ చేయాల్సిన పరిస్థితి: ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే ఫైట్‌ చేయాల్సి వస్తోంది. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ దేశంలో కొందరు రియల్ జర్నలిస్టులు తప్పితే మిగిలిన వాళ్ళు ఫెస్టివల్స్‌తో బిజీగా ఉంటున్నారు. కొన్నాళ్లు సూసైడ్‌ ఫెస్టివల్స్‌.. సుశాంత్‌ ఒక్కడే కాదు అదే టైంలో ఇండియా‌లో 300 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వాళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గాల్వాన్‌ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు ఎవరికీ తెలియదు. కనీసం ఆ మహావీరుల గురించి ఆలోచించరు కూడా. బడా పొలిటీషియన్స్ పిల్లలు: ఇక నెపోటిజం ఫెస్టివల్‌.. అందరూ కలిసి ఒకర్ని తొక్కేస్తున్నారని ఫీలైపోవడం. అది అవివేకం. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఒక స్టార్‌. కొత్త హీరో సినిమాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఆ సమయంలో ఒక్క థియేటరైనా నిండిందా? కొత్త హీరోలను ప్రోత్సహిద్దామని మీరు టిక్కెట్‌ కొన్నారా? చివరికి మీరు స్టార్స్‌ సినిమాలే చూస్తారు. ఇప్పుడు డ్రగ్స్‌ ఫెస్టివల్‌.. సెలబ్రిటీలందర్నీ తీసుకువెళ్లి ఫ్యాషన్‌ పరేడ్‌లు పెట్టారు. పోలీసులకు, పబ్లిక్‌కి కూడా తెలుసు వారు డ్రగ్స్ సరఫరా చేయరని. మహా అయితే డ్రగ్స్ తీసుకున్నారేమో. మరి ఈ లిస్టులో బడా పొలిటీషియన్స్ పిల్లల పేర్లు లేవెందుకు? సెలబ్రిటీలు ఒక్కరే వాడుతున్నారా?. పోలీసుల ముందే గంజాయి తాగుతూ: డ్రగ్స్ కోసం ఇంత ఇష్యూ చేస్తున్నారు. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్‌మెంట్ అసలు డ్రగ్స్ తయారు చేస్తున్న డాన్‌ని అరెస్ట్ చేశారా? ప్రతి ఊళ్ళో, ప్రతి చోట కోట్లమంది సాధువులు పోలీసుల ముందే గంజాయి తాగుతుంటారు. వాళ్ళను మాత్రం ఏమీ అనరు గానీ ఎవరైనా సెలబ్రిటీపై అలాంటి ఆరోపణలు రాగానే నేరస్థులుగా చూస్తారు. ఒకటి మాత్రం నిజం. మనదేశంలో ప్రతి రోజు ఎన్నో వందల అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తున్నారు. ఇన్ని దారుణాలు ఎక్కడా లేవు. స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రమే.. ఒక ఆడదాన్ని టీవీలోకి లాగుతాం. ఇంకో ఆడదాన్ని ఇంటరాగేట్ చేస్తాం. మరో ఆడదాన్ని జైల్లో పెడతాం. పేద కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్లకు అసలు సేఫ్టీ లేదు. తెలంగాణాలో దిశకు జరిగిన న్యాయం ఈ దేశంలో అందరికీ జరగాలి. ఆడదానిగా పుట్టకూడని దేశాలు కొన్ని ఉన్నాయి. అందులో భారతదేశం మొదటిదని మీకు తెలుసా? స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రమే భారత్ మాతాకీ అంటాం.. కానీ ప్రతి రోజు తేరీ మాక్కి, మాక్కి అంటుంటాం'' అంటూ రెచ్చిపోయారు పూరి జగన్నాథ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jvdVfa

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD