Friday 4 September 2020

Prabhas: ప్రభాస్ ఆదిపురుష్‌పై నెగెటివ్ కామెంట్స్.. ముందు ఆ స్టార్‌ని మార్చేయండంటూ రచ్చ రచ్చ!!

ప్రస్తుతం చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి 'ఆదిపురుష్'. దాదాపు 750 కోట్లు కేటాయించి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్ లుక్ రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపిన మేకర్స్.. గత రెండు రోజుల క్రితం ఈ మూవీ విలన్ రోల్ రివీల్ చేశారు. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, రావణాసురుడు లంకేష్ రోల్‌ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించనున్నట్లు తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోల్స్ ఊపందుకున్నాయి. 7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు అంటూ ఆదిపురుష్ విలన్ పాత్రపై హైప్ తీసుకొచ్చిన యూనిట్ సభ్యులు ఆ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ పవర్‌ఫుల్ విలన్ రోల్ కోసం ముందుగా అజయ్ దేవగన్‌ని తీసుకోవాలని ప్రయత్నం చేసిందట చిత్రయూనిట్. కానీ ఆయనకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను ఒప్పుకోలేదట. దీంతో ఆ స్థానంలో సైఫ్ అలీ ఖాన్‌ని సెలక్ట్ చేశారట మేకర్స్. ఈ క్రమంలో ఎప్పుడైతే 'ఆదిపురుష్'లో రావణాసురిడి రోల్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిందో.. అప్పటినుంచి ఆయనపై ట్రోల్స్ మొదలు పెట్టారు నెటిజన్లు. కొందరైతే ఏకంగా మరికాస్త చొరవ తీసుకొని సైఫ్ అలీ ఖాన్‌ని తొలగించి వేరే యాక్టర్‌ని తీసుకోండంటూ సలహాలు ఇస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదిపురుష్ విలన్ రోల్ రచ్చ హాట్ ఇష్యూ అయింది. Also Read: ఇదిలాఉంటే ప్రభాస్ సరసన సీతగా నటించనున్న హీరోయిన్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పాత్ర కోసం కీర్తి సురేష్, నయనతార, కియారా అద్వానీ పేర్లు పరిశీలనలో పెట్టారని సమాచారం. గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో పాన్ ఇండియా మూవీగా 'ఆదిపురుష్' ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32XRUhX

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...