Tuesday, 1 September 2020

Pawan Kalyan: వకీల్ సాబ్ మోషన్ పోస్టర్.. పగిలిపోయిందంతే

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టే ఉదయం 9.9 గంటలకు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. గాంధీ, అంబేద్కర్ వంటి మహానుభావుల్ని ఈ మోషన్ పోస్టర్‌లో చూపిస్తూ.. లాయర్ గెటప్‌లో సీరియస్ లుక్‌లో దర్శనం ఇచ్చారు పవన్ కళ్యాణ్. చేతిలో క్రిమినల్ లా బుక్ పట్టుకుని చేతితో కర్ర పట్టుకుని వకీల్ సాబ్.. నేరస్థుల కీళ్లు విరిచేందుకు రెడీ అని చెప్పకనే చెప్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే అంటూ వచ్చే ఆర్ ఆర్ మోషన్ పోస్టర్‌కి మరింత హైప్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QMwjTS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....