Friday 4 September 2020

Nani: V మూవీ ట్విట్టర్ రెస్పాన్స్.. అందుకే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్.. ప్రేక్షకుల మాట ఇదే

దాదాపు 5 నెలల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ సినిమా చూసే అవకాశం దక్కింది. కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో థియేటర్స్ మూతపడటంతో కొత్త సినిమాల విడుదలకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఇప్పటిదాకా ఈ వేదికలపై చిన్న సినిమాలే విడుదల కాగా నేడు (సెప్టెంబర్ 5) నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన మూవీ భారీ అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయింది. మరి ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో ఓ లుక్కేద్దామా.. ఇప్పుడే V చూశాను. మూవీ ఓకే.. స్టోరీ రొటీన్‌గా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విటుంటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. నాని యాక్టింగ్ చాలా బాగుంది. కానీ సినిమాలో ఎక్కువ ట్విస్ట్స్ ఉంటాయనుకుంటే పెద్దగా లేవు. అందుకే చాలా మందికి నచ్చలేదు. అనుకున్నంత మ్యాచ్ అయితే కాలేదు. క్లైమాక్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి.. అక్కడ చూసింది ఒకటి. ఏదేమైనా నాని యాక్టింగ్ మాత్రం రచ్చ రచ్చ. లాస్ట్‌లో ఇద్దరూ హగ్ చేసుకుంటారు అనుకుంటే షేక్‌హ్యాండ్ తోనే సరిపెట్టారు ఇంద్రగంటి. చాలా డిజప్పాయింట్ అయ్యా. సుధీర్ బాబు యాక్షన్ ఇరగదీశాడు. నాని కెరీర్‌లో 25వ మూవీగా వచ్చిన ఈ సినిమా గనక థియేటర్స్‌లో విడుదలై ఉంటే రికార్డ్స్ బ్రేక్ చేసేది. యాక్టింగ్ పరంగా నాని, సుధీర్ బాబు కెమెరా ముందు పోటీపడ్డారనిపిస్తోంది. హీరోయిన్ నివేదా థామస్ కోసం చూడొచ్చు సినిమాను. నివేదా చాలా బాగా నటించింది. మేము వార్ ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళు ధూమ్ తీశారు. సుధీర్ బాబు పర్‌ఫార్‌మెన్స్ చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సెకండాఫ్ కాస్త స్లో అనిపించినా మొత్తానికి సినిమా పర్వాలేదనిపించింది. సో.. నాని Vపై ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సినిమా మిక్స్‌డ్ సొంతం చేసుకుందని స్పష్టమవుతోంది. నటీనటుల పర్‌ఫార్‌మెన్స్ బాగున్నా సినిమా అనుకున్న రేంజ్‌లో థ్రిల్ చేయలేదని తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్‌పై పాజిటివ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. ఏదేమైతే ఏం ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం వచ్చేసింది కదా.. మీరు కూడా ఈ సినిమా చూసేయండి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lRPzh0

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...