Sunday, 6 September 2020

Devi Nagavalli Bigg Boss: పెళ్లైన 8 నెలలకే వదిలేశా.. ఆరేళ్ల బాబు ఉన్నాడు, డబ్బు కోసమే బిగ్ బాస్‌కి వచ్చా: టీవీ 9 యాంకర్ దేవి

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 4లో ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి. స్టైలిష్ లుక్‌లో వామ్మో అనేట్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తన పేరు నాగవల్లి అని పుట్టింది పెరిగింది అంతా రాజమండ్రిలోనే అని తెలిపింది. బీకాం వరకూ చదువుకున్న ఆమె గ్రాఫిక్స్ నేర్చుకుని గ్రాఫిక్ డిజైనర్‌గా ఒక ఛానల్‌లో అప్లై చేశానని (టీవీ 9 అని చెప్పలేదు).. అయితే గ్రాఫిక్ డిజైనర్‌గా వెళ్లిన తనను యాంకర్‌గా చేయమని అడిగారని ఆఫర్ వస్తే వదిలేయడం ఎందుకని అప్లై చేస్తే యాంకర్‌గా సెలెక్ట్ అయినట్టు తెలిపింది దేవి. లంగాఓనీ వేసుకుని చీరకట్టుకుని కవరేజ్‌కి వెళ్లగలరా అని అడిగారు. నాకు ఉరుకులు పరుగులు అంటే ఇష్టం.. నేచర్ డిజాస్టర్, బ్లాంబ్ బ్లాస్ట్ లాంటివి కవర్ చేయడం ఇష్టం అని తెలిపింది. అయితే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోగా.. యుఎస్ఏ ఆఫర్ వస్తే అక్కడకు వెళ్లి ఎనిమిది నెలలకంటే ఎక్కువ ఉండలేకపోవడంతో విడాకులు తీసుకున్నానని.. ఇప్పుడు తనకు ఆరేళ్ల బాబు ఉన్నాడని తెలిపింది దేవి. చాలామంది ఈ అమ్మాయి మంచిది అనే సర్టిఫికేట్ కోసం ట్రై చేస్తారు.. కాని ఇలాంటివి తాను కేర్ చేయనని తెలిపింది దేవి. బిగ్ బాస్ హౌస్‌లో లేడీ బిగ్ బాస్ లేదు కదా అందుకే తనకు విన్నర్ అవ్వాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది దేవి. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన తరువాత ఎప్పటిలాగే డిఫరెంట్ వేషధారణతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బాంబ్ బ్లాస్ట్‌లు కవర్ చేసినా వాటికంటే బిగ్ బాస్ అంటేనే భయంగా ఉందంది దేవి. దీంతో నాగార్జున దేవి నాగవల్లికి భయమా.. అందర్నీ తన ప్రశ్నలతో భయపెట్టే దేవి నాగవల్లి భయమా అని అనడంతో.. భయాన్ని నేను క్యారీ చేయలేను సార్ అందుకే అడిగేస్తుంటా అంటూ చెప్పుకొచ్చింది దేవి. ఇంతకీ బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వచ్చావ్ అని నాగార్జున అడగ్గా.. ‘నేను న్యూస్ చదివేటప్పుడు వాళ్ల దగ్గర అంత డబ్బు ఉంది.. ఇంత డబ్బు ఉంది ఇంత సంపాదించారు అని.. నాకు ఒక మనిషి అంత డబ్బు ఎలా సంపాదిస్తాడని అనిపించింది. అందుకే జీవితంలో నా మొహం ఎప్పుడైనా అంత డబ్బు చూస్తుందా అని.. పదో తారీఖు వచ్చిందంటూ వచ్చిన జీతం అయిపోద్ది.. హోమ్ లోన్ మిగతా వాటిని కట్టడం కష్టంగా ఉంది.. అందుకే బిగ్ బాస్ ఫ్రైజ్ మనీ కోసమే వచ్చినట్టు చెప్పింది దేవి. డబ్బు కోసం తప్ప వేరే దానికి రాలేదని చెప్పింది. ఇక్కడంతా స్కిప్ట్ ప్రకారం జరుగుతుందని ఇంటర్వ్యూలు చేస్తారు కదా.. నిజమేనా అని నాగార్జున అడగ్గా.. అది కష్టం సార్.. అంతా లైవ్ అంటూ పూర్తి స్థాయిలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మారిన నాగవల్లిగా మాట్లాడింది యాంకర్ దేవి. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jLd2P8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....