Tuesday 8 September 2020

Chiranjeevi: జయప్రకాష్ రెడ్డి మృతిపై బాలకృష్ణ, చిరంజీవి సంతాపం.. ఆ అవకాశం వినియోగించుకోలేదంటూ ఆవేదన

నేటి (మంగళవారం) ఉదయం కమెడియన్ కమ్ విలన్ మరణవార్తతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది. జయప్రకాష్ రెడ్డి ఇక లేరని తెలిసి షాకైంది సినీ లోకం. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు ట్వీట్స్ చేశారు. ''జయప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళు గా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. మా ఇద్దరి మధ్యా ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. ఆయన లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను'' అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. Also Read: ''జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంత గానో బాధించింది. మా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పదిమందికి సహాయం చెయ్యాలనే వ్యక్తి తను. జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని షిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ''సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనతో కలసి నేను ఆఖరుగా చేసిన సినిమా ఖైదీ నెంబర్ 150. నాటక రంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి అనే చెప్పేవారు. శని, ఆది వారాల్లో స్టేజ్ మీద పర్ఫామెన్స్ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి అనేవారు. కానీ ఆయనిచ్చిన ఆ అవకాశాన్ని వినియోగించు కోలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయనే. తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అంటూ ఎమోషనల్ అయ్యారు. ''జయప్రకాష్ రెడ్డి గారు లేరు అనగానే షాక్‌కి గురయ్యాను. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ మరీ ఇష్టం. నా అన్ని సినిమాల్లోనూ ఆయన ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తి, మంచి నటుడిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది'' అని వివి వినాయక్ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jWjJ14

No comments:

Post a Comment

'Didn't Know Mirch Masala Would Be...'

'She was my only choice to play Sonbai. The moment she read the script, she slipped into character.' from rediff Top Interviews ht...