Monday 21 September 2020

Chiranjeevi: ఆ లేడీతో కలిసి చంద్రబాబు కుట్ర! చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు.. పోసాని సెన్సేషన్

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ రాజకీయ జర్నీలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కావాలనే ఆయన్ను టార్గెట్ చేసి చుక్కలు చూపించారని, వ్యక్తిగత విషయాల జోలికొచ్చి కుటుంబాన్ని దూషించడంతో మెగాస్టార్ కన్నీళ్లు పెట్టుకున్నారని చెబుతూ ఆ సందర్భాన్ని వివరించారు నటుడు, రచయిత . చిరంజీవిని రాజకీయాల్లో ఎలా ఎదుర్కోవాలో తెలియక చంద్రబాబు నాయుడు ఓ మహిళా నేతతో కలిసి కుట్ర పన్నారని, ఆమెతో చిరంజీవి కుటుంబాన్ని తిట్టించడంతో చిరంజీవి తీవ్ర మనస్థాపం చెందారని పోసాని చెప్పుకొచ్చారు. మెగాస్టార్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి బ్యాడ్‌గా మాట్లాడి ఆయనను మానసికంగా హింసించారని, ఆ సందర్భం తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు పోసాని. Also Read: ''చిరంజీవి కూతురు ఓ వ్య‌క్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంపై టీడీపీ మ‌హిళానేత‌ చిరంజీవిపై కామెంట్స్ చేశారు. త‌న సొంత కూతురినే కంట్రోల్ చేయ‌ని ఆయన, రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తార‌ని ఎద్దేవా చేయడంతో చిరంజీవి మానసిక క్షోభ అనుభవించారు. 2 నెలల పాటు బాధ పడ్డారు. ఈ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవడం సహజమే. నచ్చకపోతే విడాకులు కూడా తీసుకోవడం కూడా కామనే. సాధారణంగా ఇది చాలా ఇళ్లల్లో జరుగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ కుటుంబంలో జరగలేదా?'' అని పేర్కొన్న పోసాని.. ఆ ఘటన తర్వాత చంద్రబాబు అంటేనే తనకు అసహ్యమేసిందని చెప్పుకొచ్చారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి పొలిటీషియన్ తన కుటుంబం జోలికి వస్తాడని చిరంజీవి కలలో కూడా ఉహించలేదని, ఆ సమయంలో తానే రంగంలోకి దిగి టీడీపీ నేతల నోళ్లు మూయించానని పోసాని తెలిపారు. ఇకపోతే తనకు ఎలాంటి రాజకీయ పదవులు వద్దని మరోసారి స్పష్టం చేసిన పోసాని, సినీ ఇండస్ట్రీలో ఏపీ సీఎం జగన్‌ను ప్రేమించేవారు చాలామంది ఉన్నారని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32PcNgf

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...