Wednesday, 9 September 2020

సూపర్‌స్టార్ అభిమానులకు బిగ్‌ న్యూస్.. షూటింగ్ షురూ చేసిన మహేశ్‌

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని సినీ పరిశ్రమ మొత్తం కొద్ది నెలలుగా మూతపడిన సంగతి తెలిసిందే. చిన్ని సినిమాలతో పాటు భారీ ప్రాజెక్టులు సైతం మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అయితే అన్‌‌లాక్ ప్రక్రియలో భాగంతో కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తుండటంతో సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల షూటింగులు కూడా తిరిగి ప్రారంభమై మళ్లీ సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పెద్ద సార్లు కూడా షూటింగులకు హాజరవుతున్నారు. కింగ్ నాగార్జున ఇటీవలే బిగ్‌బాస్-4తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. Also Read: తాజాగా సూపర్‌స్టార్ సైతం ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి హిట్ సొంతం చేసుకున్న మహేశ్ కొద్దినెలలు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. దీంతో మే నెల వరకు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోలేదు. పరశురామ్‌తో తీయబోయే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా తర్వాతే అని చెప్పేశాడు. ఈలోగా లాక్‌డౌన్ ఏర్పడటంతో ఆయనకు మరింత రెస్ట్ దొరికింది. ఈ సమయంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. Also Read: తాజాగా మహేశ్‌బాబు ఓ షూటింగ్ నిమిత్తం మేకప్ వేసుకున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మహేష్ ఓ యాడ్ నిమిత్తం షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఈ వాణిజ్య ప్రకటనకు సంబంధించి మహేశ్‌బాబు పాల్గొన్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. రెండుమూడు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌లో కోవిడ్ నిబంధలన్నీ కచ్చితంగా పాటిస్తున్నారు. సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించడంతో పాటు ఆ ప్రాంతాన్ని మొత్తం శానిటైజేషన్ చేసినట్లు సమాచారం. మరోవైపు సినిమా షూటింగ్‌లో మాత్రం సూపర్‌స్టార్ ఎప్పుడు పాల్గొంటారన్నది సస్పెన్స్‌గా మారింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DNTaf2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....