Saturday 5 September 2020

బిగ్ బాస్ ఓపెనింగ్ సెర్మనీ.. రాహుల్ సర్ ప్రైజ్, హౌస్‌లో ఇంతకు ముందులా కాదు.. ఎవరికి వారే

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతుంది. ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ఓపెనింగ్ సెర్మనీకి అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఓపెనింగ్ సెర్మనీకి సంబంధించిన షూట్ పూర్తికాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వివరాలు వారి పేర్లు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గత మూడు సీజన్లలో ఈపాటికే కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు వచ్చేసేది. అయితే ఈసారి మాత్రం లీక్‌లు లేకుండా జాగ్రత్తపడ్డారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే సెలబ్రిటీలను క్వారంటైన్‌లో ఉంచి.. ఒక్కొక్కరుగా హౌస్‌లోకి పంపబోతున్నారు. ఈ ఓపెనింగ్ సెర్మనీకి సంబంధించిన బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్‌తో మ్యూజిక్ షోతో పాటు.. ఒక్కో కంటెస్టెంట్స్‌కి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ సాంగ్.. వాళ్ల ప్రొఫైల్ వీడియోలను ఇప్పటికే సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక హోస్ట్ నాగార్జునకి సంబంధించి స్పెషల్ వీడియోపాటు ఎంట్రీ సాంగ్‌కి అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాంగ్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఎవరన్న విషయానికి వస్తే.. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో ఉండబోతుండగా.. తొలిరోజు 14 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌కి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గుర్నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌కి తీసుకురాబోతున్నారు. అయితే తొలి మూడు వారాలు ఎలిమినేషన్ జోలికి పోకుండా.. ఆ తరువాతే అసలు ఆట మొదలుకాబోతుందని తెలుస్తోంది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ని ముందే సెలెక్ట్ చేసి వారిని మిగిలిన ఇంటి సభ్యులతో పాటు క్వారంటైన్‌లోనే ఉంచినట్టు తెలుస్తోంది. సో.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరొస్తారనే టెన్షన్ గత సీజన్లలో కంటెస్టెంట్స్‌కి ఉండేది. ఈసారి వాళ్లు ఎవరో ముందే సమాచారం ఉండటంతో వైల్డ్ కార్డ్ ప్రభావం ఈసారి షోపై పెద్దగా ఉండకపోవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్‌ని కరోనా నేపథ్యంలో చాలా కట్టుదిట్టంగా కంటెస్టెంట్స్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్ చేశారు. గతంలో మాదిరి కంబైండ్ బెడ్‌లు కాకుండా ఎవరికి వారే సెపరేట్ బెడ్‌లు ఉంచినట్టు తెలుస్తోంది. ఇక హౌస్‌లోకి నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు స్పెషల్ టీంలో పాటు.. కొన్ని ఫిజికల్ టాస్క్‌లను ఈ సీజన్‌కి దూరం పెట్టబోతున్నారు. అలాగే టాస్క్‌లో భాగంగా ఇంతకు ముందు బయటి వ్యక్తులు హౌస్‌లోకి వెళ్లేవారు.. దొంగల టాస్క్ లాంటి వాటిలో బయటకు వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా అలాంటి టాస్క్‌లు ఈ సీజన్‌లో కనిపించకపోవచ్చు. ఇక కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్‌ని హౌస్‌లోకి పంపించి.. సుమారు రెండు వారాల పాటు నాటకీయతను జోడించేవారు గత సీజన్లలో.. ఈసారి కరోనా నేపథ్యంలో ఈ టాస్క్‌‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయవచ్చు బిగ్ బాస్. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ అంచనా.. 1. టీవీ యాంకర్ దేవి 2. దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్) 3. గంగవ్వ 4. ముక్కు అవినాష్ (జబర్దస్త్) 5. హెచ్ఎంటీవీ యాంకర్ సుజాత 6. యాంకర్ లాస్య మంజునాథ్ 7. యూట్యూబ్ సంచలనం గంగవ్వ 8. యాంకర్ అరియానా గ్లోరీ 9. కరాటే కళ్యాణి 10. డైరెక్టర్ సూర్య కిరణ్ 11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్ 12. కరాటే కళ్యాణి 13. యాంకర్ తనూజా పుట్టాస్వామి 14. హీరోయిన్ మొనాల్ గుజ్జార్


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/320tapQ

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...