Saturday, 5 September 2020

బ్లాక్‌మెయిల్ చేసి ఆ సీన్లు చేయించారు.. సినీ ఇండస్ట్రీ అంతా కరిచే పాములే.. బ్లాస్ట్ అయిన సమీరా రెడ్డి

ఒకానొక సమయంలో హిందీ, తెలుగు పాటు పలు సౌత్ ఇండియన్ భాషల్లో సినిమాలు చేసి కుర్రకారును షేక్ చేసింది . ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాలలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమైంది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటున్న సమీరా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇండీస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొన్నేళ్ల క్రిందట బిజినెస్‌మేన్ అక్షయ్ వార్ధేని పెళ్లాడిన సమీరా రెడ్డి.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇప్పటిదాకా తన ప్రెగ్నెసీ సంగతులు ఓపెన్‌గా చెప్పేస్తూ పలు పోస్టులు పెట్టిన ఈ అమ్మడు.. తాజాగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా అంతా కరిచే పాములే అంటూ బ్లాస్ట్ అయింది. ఈ మేరకు తాను ఎదుర్కొన్న షాకింగ్ ఘటన బయటపెట్టింది సమీరా. Also Read: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ బడా బాబుల గురించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్న నేపథ్యంలో సమీరా రెడ్డి నోరువిప్పింది. నటవారసులకు అవకాశాలివ్వడం కోసం తనను మూడు సినిమాల నుంచి తీసేశారని చెబుతూ ఓపెన్ అయింది. ఇక్కడ ప్రతి అడుగూ ఆచితూచి వేయాలని, లేదంటే పాములు కరిచేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక ఓ సినిమాలో లిప్‌లాక్ సీన్ కోసం తనను ఇబ్బంది పెట్టిన ఘటనను గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందింది సమీరా. ముందు వినిపించిన స్క్రిప్ట్‌లో లిప్‌లాక్ సీన్ లేదని, మధ్యలో దాన్ని జొప్పించి ఆ సీన్ చేయాల్సిందే లేదంటే సినిమా లోంచి తీసేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని, మహిళా నటులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కుండబద్దలు కొట్టేసింది సమీరా రెడ్డి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gX2J8N

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....