Friday 11 September 2020

సోనూ సూద్ సాయంతో భారతదేశం బాగుపడిందా? అంతకంటే గొప్పోళ్ళున్నారు.. బిల్డప్ అంటూ పోసాని సంచలనం

కరోనా కారణంగా ఏర్పడిన క్రైసిస్‌లో లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ఎంతో మంది కార్మికులకు తన వంతు సాయం అందించి పాపులారిటీని రెట్టింపు చేసుకున్నారు బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్. ఉపాధి లేక నగరాల్లో ఇరుక్కుపోయిన కార్మికులను వారి వారి సొంత గూటికి చేర్చుతూ పలువురి మన్ననలు పొందారు. ఆ తర్వాత కూడా చాలా మంది చాలా రకాలా సాయిలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు టాలీవుడ్ నటుడు . సాయంతో భారతదేశం బాగుపడిందా? అంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టేస్తూ మాట్లాడేస్తుంటారు పోసాని. సినిమాల్లో వేషం వేసినా, నిజ జీవితంలో అయినా అదే ఆయన సహజ లక్షణం. సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల తనదైన కోణంలో విశ్లేషణ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ వేళ సోనూ సూద్ చేసిన సాయంపై ఓపెన్ అయ్యారాయన. సోనూ సూద్ వలె తెలుగు ఇండస్ట్రీలోని నటీనటులు ఏం చేశారని యాంకర్ అడిగిన ప్రశ్నపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ టాలీవుడ్‌లో అంతకంటే గొప్ప వాళ్ళున్నారని చెప్పుకొచ్చారు పోసాని. Also Read: సోనూ సూద్ నిన్నగాక మొన్నొచ్చాడని, ఆపత్కాలంలో ఆయన కంటే ఎక్కువ సాయాలు చేసిన తెలుగు స్టార్స్ ఉన్నారని చెప్పిన పోసాని.. సోనూ సూద్ లాగా మనోళ్లు పేపర్లలో కనపడరని అన్నారు. తాను కూడా ఎన్నో సందర్భాల్లో తోచిన సాయం చేశానని, కాకపోతే అవన్నీ బయటకు చెప్పుకోలేదని అన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎంతో మంది కోట్లలో సాయం అందించారు కానీ మనవాళ్లెవరూ బిల్డప్ ఇచ్చుకోరంటూ రెచ్చిపోయారు. కొందరు రూపాయి పెట్టి దానికి పెద్ద బోర్డు ప్రెస్ మీట్ పెట్టి నానా హంగామా చేస్తారంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు పోసాని కృష్ణమురళి. చివరగా సోనూ సూద్‌ని అనడం కాదు కానీ.. గర్వంగా చెబుతున్నా ఆయన కంటే 1000 రెట్లు బ్రాడ్ మైండ్ ఉన్న హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ టాలీవుడ్ లో ఉన్నారంటూ గట్టిగా చెప్పారు పోసాని. సోనూ సూద్ దేశం మీద ప్రేమతో ఇచ్చుకున్నాడో లేక దేశ భక్తితో ఇచ్చుకున్నాడో తెలియదు కానీ బిల్డప్ కోసం ఇచ్చాడని అనలేమని లాజికల్‌గా మాట్లాడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FtLfUI

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...