Tuesday, 1 September 2020

అప్పుడూ.. ఎప్పుడూ.. నీ కాళ్లదగ్గరే మామా.. ఒక్క ఫొటోతో పవన్ ఫ్యాన్స్‌ని కదిలించిన సాయి ధరమ్ తేజ్

పవర్ స్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండటం.. ఆయన పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాడు ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ ఉండటంతో ట్విట్టర్ వేదికగా పవన్‌కి విషెష్ అందిస్తూ ట్వీట్ల జాతర కొనసాగిస్తున్నారు పవన్ అభిమానులు. #HBD Pawan Kalyan హ్యాష్ ట్యాగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ ట్వీట్లతో ట్విట్టర్ హీటెక్కిపోతుంది. ట్విట్టర్‌లో సరికొత్త రికార్డుల దిశగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో అభిమానుల్ని ఉత్సాహపరుస్తూ.. తన మేనమామకు పుట్టినరోజు విషెష్ అందిస్తూ మేనల్లుడు పెట్టిన ఫొటో పవన్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేట్టుగా ఉంది. సాయి ధరమ్ తేజ్ చిన్నప్పుడు తన మామ పవన్‌తో ఆడుకుంటూ అతని కాళ్లను పట్టుకుని దర్జాగా కూర్చుని ఉన్నాడు.. పడుకుని ఉన్న పవన్.. సాయి తేజ్ పడిపపోకుండా తన కాళ్లను మడిచిపట్టుకుని మేనల్లుడ్ని చూస్తూ ఉన్నారు. ఈ మామా అల్లుళ్ల రేర్ పిక్‌కి పవన్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ అనే క్యాప్షన్ ఇచ్చి.. పవన్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టేశాడు. మేం ఎంత ఎత్తుకి ఎదిగినా నీ కాళ్ల దగ్గరే అనే అర్థంలో సాయి ధరమ్ ఈ ఫొటో వదలడంతో పవన్ అభిమానులు రీ ట్వీట్లతో వైరల్ చేస్తున్నారు. Read Also: Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QIOxFZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....