Sunday 6 September 2020

బిగ్ బాస్: మంగలి అర్చనే.. ఈ అరియానా గ్లోరీ, నాగార్జునకు చెప్పనన్న బోల్డ్ యాంకర్ సీక్రెట్స్

నేను బోల్డ్... నేను బోల్డ్.. నేను బోల్డ్.. బిగ్ బాస్ సీజన్ 4లో 10వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన యాంకర్ . తాను చాలా బోల్డ్ అంటూ తెగ చెప్పుకుంది. ‘కొంతమంది కట్టుబాట్ల దుప్పట్లు కప్పేసిన మనసు.. మారుతూ ముందుకు వెళ్తున్న సమాజాన్ని చూడటానికి భయపడుతుంది. బట్ ఐ యామ్ బోల్డ్. సమయం కూడా అందుకోలేని వేగంగా పరుగులు తీసే పనులు చేశాను.. అందుకే ఐ యామ్ బోల్డ్.. నా బట్టల గురించి సమాజం అనే మాటలకి వణికిపోయే గుండె చప్పుడు కాదు నేను.. అందుకే ఐయామ్ బోల్డ్’ అంటూ స్పెషల్ వీడియోలో చెప్పిన అరియానా గ్లోరీని బోల్డ్ యాంకర్‌ మార్చింది అయితే రామ్ గోపాల్ వర్మ అనే చెప్పొచ్చు. అప్పట్లో వర్మను ఇంటర్వ్యూ చేసిన ఆమె.. మీకు ఇప్పటి వరకూ తీరని కోరికలు ఏమైనా ఉందా సార్ అంటే.. నిన్ను బికినీలో చూడాలని ఉంది.. నేను సినిమాలో ఛాన్స్ ఇస్తా వస్తావా? బికినీ వేస్తావా? అంటూ వర్మ ఈమెను బోల్డ్ యాంకర్‌గా పాపులర్ చేశారు. అయితే అనూహ్యంగా ఈమె బిగ్ బాస్ సీజన్ 4లో బోల్డ్ యాంకర్‌గా దర్శనం ఇచ్చింది. బట్టల విషయంలో కాస్త పొదుపుని పాటిస్తూ సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన ఈమె బిగ్ బాస్ స్టేజ్ మీద పొట్టి బట్టలతో హాట్ డోస్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన తరువాత.. ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ‘నీకు ఫేస్ రీడింగ్ తెలుసు అంట కదా’.. అని నాగార్జున అంటే ‘ఓ మై గాడ్ సీరియస్లీ’ అంటూ ఇంగ్లిపీస్‌లో మాట్లాడేసింది గ్లోరీ. తెలుగులో మాట్లాడుకుందామా? అరియానా అని పంచ్ ఇచ్చిన నాగ్.. ‘నాకు కూడా ఫేస్ రీడింగ్ బాగా తెలుసు.. నీ పేరు అరియానా గ్లోరీ కాదు కదా.. అసలు పేరు చెప్పమని అడిగారు. ఆ పేరు నేను చెప్పననేసింది బోల్డ్ యాంకర్. నాకు ఆ పేరు అంటే సెంటిమెంట్.. ముఖ్యంగా భయం. ఆ పేరు పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చిన తరువాత చాలా స్ట్రగుల్స్‌లో ఉన్నా.. అరియానా గ్లోరీగా మారిన తరువాత నాలుగేళ్లలో ఎప్పుడూ ఖాళీగా లేను బిజీగా ఉన్నాను’.. తన అసలు పేరు మాత్రం సీక్రెట్ అనేసింది అరియానా. అయితే ఇంతకీ అరియానా ఎవరు? ఏమిటి? ఎక్కడ నుంచి వచ్చింది? ఆమె అసలు పేరేంటి? అనే చర్చలు నెటిజన్లలలో మొదలు కాగా.. ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు రాబట్టింది తెలుగు సమయం. అరియానా అసలు పేరు (మంగలి ఆమె ఇంటి పేరు). 1993 జనవరి 25న పుట్టిన అర్చన పుట్టి పెరిగింది వికారాబాద్‌లోని తాండూరు. యాంకర్ అవ్వాలనే మక్కువతో చదువుని మధ్యలోనే వదిలేసింది. డిగ్రీ ఫెయిల్ అయిన అరియానా.. 2014లో హైదరాబాద్ వచ్చి యాంకర్‌ అయ్యేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. ఎక్కడా అవకాశాలు రాకపోవడంతో ఏడాది పాటు స్ట్రగుల్ అయ్యింది. అయితే 2015లో స్టుడియో వన్ ఛానల్‌తో యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టింది. ఆ తరువాత 2016 నుంచి ఈటీవీ అభిరుచి కార్యక్రమంలో ముగ్గురు యాంకర్లలతో పాటుగా తాను ఘుమ ఘుమలాడించింది. అయితే మధ్యలో జెమిని కామెడీ ఆడిషన్స్‌కి వెళ్లగా హోల్డ్‌లో పెట్టి.. 2017లో యాంకర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి జెమిని కామెడీలో యాంకర్‌గా కొనసాగుతోంది అరియానా గ్లోరీ (అర్చన). అయితే ఫ్రీలాన్సర్‌గా చాలా యూట్యూబ్ ఛానల్‌లకి సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసేది అరియానా. ఇప్పటి వరకూ దాదాపు 500 మందికి పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలను చేసింది అరియానా. అయితే వర్మ ఇంటర్వ్యూలోని బోల్డ్ కామెంట్స్‌తో బోల్డ్ యాంకర్‌గా పేరొంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది మన తాండూరు అర్చన అదేనండీ అరియానా గ్లోరీ. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i4SOQ8

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6