పవర్ స్టార్.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. ఆయన తెరపై కనిపిస్తే వాళ్లను ఆపడం ఎవరితరం కాదు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఆయన అభిమానులకు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆయన చూపించిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. అందుకే, రాజకీయాల్లోకి వెళ్లి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తున్నా ఆయన సినీ ఇమేజ్‌కు, మార్కెట్‌కు మాత్రం అస్సలు డోకా లేదు. ‘వకీల్ సాబ్’గా తన అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వకీల్ సాబ్’, క్రిష్‌తో చేస్తోన్న మరో సినిమా గురించి చర్చ బాగా జరుగుతోంది. రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి మధ్య పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మరో విషయం వైరల్‌గా మారింది. అదేంటంటే.. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్. పవన్ పాత ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో యంగ్ పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. అప్పుడప్పుడే వస్తోన్న మీసం, గెడ్డం.. చందమామ లాంటి ఆ ముఖం వాహ్ అంతే. ముఖ్యంగా ఆ కళ్లు ఉన్నాయి చూడండి.. ఎవ్వరైనా పడిపోవాల్సిందే. ఈ ఫొటోను మీమ్స్ క్రియేటర్స్ విపరీతంగా వాడేస్తున్నారు. రకరకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇవి చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3keWY8O
No comments:
Post a Comment