Saturday, 12 September 2020

నేటికి 40 ఏళ్లు.. కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి అంటూ విజయశాంతి మెసేజ్

విజయశాంతి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా, లేడీ అమితాబ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న నటి . 90ల్లో పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కేరాఫ్ విజయశాంతి. నిజం చెప్పాలంటే తెలుగులో విజయశాంతితోనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి భారీ క్రేజ్ వచ్చింది. కేవలం నటిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా తనదైన ముద్ర వేశారు విజయశాంతి. మెదక్ ప్రజలకు ఎంపీగా సేవలందించారు. ఇదిలా ఉంటే, విజయశాంతి 1980లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆమె మొదటి చిత్రం ‘కిలాడి కృష్ణుడు’. సూపర్ స్టార్ కృష్ణ సరసన హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. దివంగత నటి విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980 సెప్టెంబర్ 12న విడుదలైంది. అంటే, నేటికి 40 ఏళ్లు. ఈ సందర్భంగా విజయశాంతి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తనకు అవకాశం ఇచ్చిన కృష్ణ, విజయనిర్మలకు విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. Also Read: ‘‘నా మొదటి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు. నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలతో...’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kfSuyn

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...