Sunday, 6 September 2020

‘కిరిక్ పార్టీ’ హీరోయిన్‌పై పార్క్‌లో దాడి.. అమ్మాయిల డ్రస్సింగ్‌పై కాజల్ కామెంట్

ప్రస్తుత ఆధునిక భారతదేశంలో అమ్మాయిల వస్త్రధారణపై ఇప్పటికీ ఎంతో కొంత వ్యతిరేకత వస్తూనే ఉంది. అమ్మాయిలు నిండుగా బట్టలు వేసుకోవాలి అని వాదించేవారు చాలా మందే ఉన్నారు. అసలు అమ్మాయిలు బట్టలు నిండుగా వేసుకోకపోవడం వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని మొండిగా వాదించేవాళ్లూ ఉన్నారు. అలాంటి ఓ పెద్దావిడ కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై దాడికి దిగారు. బెంగళూరులోని ఓ పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వర్కౌట్లు చేస్తోన్న సంయుక్త హెగ్డేపై కవితా రెడ్డి అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్కులో ఇలాంటి బట్టలు వేసుకుని డ్యాన్సులు చేస్తారా అంటూ ఆమె సంయుక్త హెగ్డే, ఆమె స్నేహితురాలిని మందలించారు. సంయుక్త స్నేహితురాలిపై చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పార్కులోని ఉన్న మగాళ్లంతా గుమికూడి ఆ పెద్దావిడకే సపోర్ట్ చేశారు. సంయుక్త హెగ్డేను తిట్టిపోశారు. అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అక్కడ జరిగిన తతంగాన్ని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు సంయుక్త. ఈ ఘటనలో సంయుక్తకు సినీ ప్రముఖుల నుంచి ప్రోత్సాహం లభించింది. హీరోయిన్ అగర్వాల్ కూడా స్పందించారు. Also Read: ఈ ఘటన గురించి సంయుక్త చేసిన ట్వీట్‌ను కాజల్ రీట్వీట్ చేస్తూ.. ‘‘ఓరి దేవుడా సామ్! ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. కవితా రెడ్డి గారు, మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. మీ ఫ్రస్ట్రేషన్‌, కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. వీటన్నింటినీ మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్లకు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది’’ అని పేర్కొన్నారు. కాగా, సంయుక్తకు కవితా రెడ్డి క్షమాపణలు చెప్పారు. పార్కులో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ReIObj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....