Wednesday, 23 September 2020

Bigg Boss Karate Kalyani: సహజీవనం చేస్తా.. పెళ్లి కావొచ్చేమో, పిల్లల్నీ ట్రై చేస్తా..: కరాటే కళ్యాణి ఇంటర్వ్యూ

కరాటే కళ్యాణి.. ఈ పేరు వింటే మనకి వెంటనే ‘బాబీ పిండేశావ్’.. అనే ఆమె పాపులర్ డైలాగ్ గుర్తుకువస్తుంటుంది. సుమారు 250 సినిమాల్లో నటించిన .. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌.. డాన్సర్.. సింగర్.. కరాటే.. హరికథ.. పెయింటింగ్.. వంట.. ఇలా ఎన్నో మల్టీటాలెంట్‌తో హౌస్‌లో అడుగుపెట్టింది కరాటే కళ్యాణి. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కరాటే కళ్యాణి.. అనూహ్యంగా రెండో వారంలోనే ఇంటి ముఖం పట్టింది. తన ముక్కుసూటి మనస్తత్వాన్ని మెచ్చని ఇంటి సభ్యులు ఆమెపై కత్తి కట్టగా.. నేనే తోపు అన్నట్లుగా వ్యవహరించడంతో ప్రేక్షకులు ఓటింగ్‌తో తీర్పు ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపేశారు. అయితే తాను హౌస్‌లో రెండు వారాలే ఉన్నప్పటికీ పది వారాలకు సరిపడా జనాన్ని ఎంటర్టైన్ చేశానని.. ఓటింగ్‌లో తేడాలు రావడం వల్ల తాను బయటకు వచ్చాను తప్పితే.. జనం తనను ఆదరించారని చెప్తోంది కరాటే కళ్యాణి. ‘సమయం తెలుగు’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. హౌస్‌లో ఎవరు ఎలా ఉంటున్నారు? ఎవరు ఎవరితో ఎఫైర్ సాగిస్తున్నారు? గంగవ్వ ప్లాన్ ఏంటి? దేవిని టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. తదితర విషయాలపై ఓపెన్ అయ్యారు. వీటితో పాటు తన పర్శనల్ లైఫ్‌కి సంబంధించిన సీక్రెట్స్‌ని రివీల్ చేశారు. ప్రేమ, పెళ్లి తనకు కలిసి రాలేదని.. వాటి పేరుతో తనను వాడుకున్నారు తప్పితే నిజమైన ప్రేమ లభించలేదని చెప్పారు కరాటే కళ్యాణి. తల్లి కావాలని బిడ్డను ఎత్తుకోవాలని తన ఆశ అని రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ ఆశ తీరలేదని చెప్తోంది కరాటే కళ్యాణి. అయితే భవిష్యత్‌లో పెళ్లి చేసుకుంటానేమో.. లేదంటే సహజీవనం చేసైనా పిల్లల్ని కనొచ్చని తెలిపింది కళ్యాణి. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. మొదట్లో పిల్లల్ని కనేందుకు కొన్ని సమస్యలు వచ్చినా.. తరువాత అలాంటివి రాలేదని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని.. అన్ని టెస్ట్‌లు చేయించుకున్నానని తెలిపింది కరాటే కళ్యాణి. మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్లు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో చూద్దాం..


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kJLfz7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....