Saturday 5 September 2020

అతని కోసం 20 లక్షల రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్.. ఇదీ ప్రభాస్ రేంజ్ అంటే!!

ప్రభాస్.. ఎంతైనా వరల్డ్ క్రేజీ స్టార్ కదా! అందుకే ఆయన ఏ పని చేసినా ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. సినిమాల్లో అయినా నిజ జీవితంలో అయినా ఈ బాహుబలి సత్తానే వేరులే. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ క్రమంలోనే తాజాగా తనకిష్టమైన తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కి ఖరీదైన సర్‌ప్రైజింగ్ ఇచ్చి అతన్ని, అతని కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాడు . యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా లక్ష్మణ్ అనే వ్యక్తి చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ప్రభాస్‌ను సరికొత్తగా మేకోవర్ చేయడంలో ఈయనదే ముఖ్యపాత్ర. ప్రభాస్ ఫిట్‌నెస్ పరంగా పర్సనల్ కేరింగ్ తీసుకొని ఎప్పటికప్పుడు తగు సూచనలిస్తుంటాడు లక్ష్మణ్. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గుర్తుగా ఖరీదైన రేంజ్‌రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాస్. ఈ సడెన్ సర్‌ప్రైజ్ చూసి లక్ష్మణ్, ఆయన ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మేరకు తన కుటుంబంతో ప్రభాస్ వద్దకు వచ్చి ఆయనతో ఫోటోలు దిగాడు లక్ష్మణ్. ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ కోసం ప్రభాస్ అందించిన ఈ గిఫ్ట్ చూసి ప్రభాస్ రేంజ్ అంటే ఇదీ అంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్. Also Read: ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్న ఆయన.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో భారీ సినిమా 'ఆదిపురుష్' చేయబోతున్నారు ప్రభాస్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZaKl6w

No comments:

Post a Comment

BJP MLA Fights BJP Govt On Corruption

'I gave enough evidence and proof to punish corrupt officials.' from rediff Top Interviews https://ift.tt/4th0uJC