Tuesday, 24 March 2020

ఊరంతా సైలెంట్... మన ఇంటి బాల్కానీలో కొత్త విషయం తెలిసిందన్న నాని

నేచురల్ స్టార్ నాని. ఏం చేసినా చాలా నేచురల్‌గానే ఉంటుంది. తాజాగా తన ట్విట్టర్ పేజీలో ఓ పోస్టు పెట్టాడు. తెలంగాణలో లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నానా సెల్ఫీ వీడియో తీశాడు. ‘ఊరంతా సైలెంట్‌గా ఉంది... ఇన్నాళ్లు పొల్యూషన్, నాయిస్ వల్ల మనకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మన ఇంట్లో మన బాల్కానీలో అంటూ’ ఓ వీడియో పోస్టు చేశాడు. అయితే విషయం ఏంటంటే నాని బాల్కానీలో ఓ చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఓ పక్షి గూడు కట్టింది. అందులో పిల్లల్ని కూడా పెట్టింది. అయితే ఈ విషయం ఇన్నాళ్లు ఇంట్లోనే ఉన్నా నానికి మాత్రం తెలియదు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో అన్నీ బంద్ చేశారు. సినిమాలు, షూటింగ్స్ అన్ని మూతపడ్డాయి. దీంతో ప్రముఖ తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. నాని ట్వీట్టర్లో పెట్టిన ఈ వీడియోకు అతని ఫ్యాన్స్ బాగా రియాక్ట్ అవుతున్నారు. సూపర్, చాాలా బాగుంది అంటూ... రిప్లై ఇస్తున్నారు. ఇంకొందరు అభిమానులు నానికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ ట్వీట్లు కూడా చూడాలంటూ... కోరుతున్నారు. కొందరు అభిమానులు నాని కోసం స్పెషల్ గా తయారు చేసిన గిఫ్ట్స్ ను కూడా ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dpdpwy

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....