Monday, 2 March 2020

హైదరాబాద్‌లో కరోనా తొలి కేసు.. ఉపాసన కొణిదెల ట్వీట్.. బాధ్యతగల పౌరులుగా

కరోనాపై ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ అపోలోలో మొదటి కరోనా కేసును గుర్తించామని.. అపోలోలో స్క్రీనింగ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. జ్వరంతో వచ్చిన రోగి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి గుర్తించామని.. ఆస్పత్రిలోని మిగతా రోగులను అతనికి దూరంగా ఉంచామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గాంధీలో రోగి చికిత్స పొందుతున్నాడు తెలియజేశారు. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ చేసేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ.. వైరస్ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలన్నారు. ఉపాసన అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.. అందుకే ఆమె స్పందించారు. సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడికి సోకినట్లు తేలింది. బాధితుడు దుబాయ్ వెళ్లిన సమయంలో ఈ వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చాడు. అనంతరం ఆయనకు వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆదివారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పరీక్షలు నిర్వహించడంతో వైరస్ ఉన్నట్లు తేలింది. దీన్ని ధ్రువ పర్చుకునేందుకు ఇతని నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కకు కూడా పంపగా,. అక్కడ కూడా పాజిటివ్ అనే వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ యువకుడు గాంధీ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులోని కరోనా వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో వైద్యులంతా అప్రమత్తమయ్యారు. ప్రత్యేకమైన దుస్తులు ధరించి, ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణ వ్యక్తులు ఈ వార్డు వద్దకు రాకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Th4F3p

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....