Monday, 2 March 2020

ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక డ్యాన్స్.. ఓవరాక్షన్ ఆపు అంటూ చివాట్లు

నటి ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక ఇప్పుడు మాంచి జోష్ మీదున్నారు. షూటింగ్స్‌లో భాగంగా అటూ ఇటూ జర్నీలు చేస్తుండడంతో ఎక్కువగా ఎయిర్‌పోర్ట్స్ దగ్గరే కనిపిస్తున్నారు. అయితే నిన్న రష్మిక హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ముందున్న ఫొటోగ్రాఫర్లు ఫొటోలు ఆమె ఫొటలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యా్న్సులు వేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ వీడియో బయటికి రావడంతో నెటిజన్లకు ఒళ్లుమండిపోయింది. రష్మిక ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎందుకు అంత ఓవరాక్షన్, దీన్నే అతి అంటారు’ అంటూ దారుణంగా ట్రోల్ చేసారు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల వరకు రష్మికను ఫ్యాన్స్, నెటిజన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి రష్మిక అంటే చిరాకుపడుతున్నారు. ఇందుకు కారణం సినిమాలో ఆమె చేసిన ఓవరాక్షనే అట. సరిలేరు నీకెవ్వరు సినిమా చూసాక పబ్లిక్ టాక్‌లోనూ కొందరు వ్యక్తులు రష్మిక ఓవరాక్షన్ వల్ల సినిమా పోయేలా ఉందని డైరెక్ట్‌గానే ఎటాక్ చేసారు. దీని గురించి రష్మిక కూడా స్పందించారు. సినిమాలో తన క్యారెక్టర్‌ అలాగే ఉండాలని, జనాలు ఓవరాక్షన్ అనుకున్నా కూడా దర్శకుడు చెప్పింది చేయడం తప్ప తానేమీ చేయలేనని అన్నారు. READ ALSO: ఆ తర్వాత ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక ప్రవర్తన చాలా మందికి చిరాకు తెప్పించింది. స్టేజ్‌పై మాట్లాడుతూ.. ‘త్రివిక్రమ్ గారూ మీ తర్వాతి సినిమాలో నేనే హీరోయిన్ కదా..’ అంటూ అవకాశాల కోసం అడుక్కుంటున్నట్లు ప్రవర్తించారట. ఆమెను కంట్రోల్ చేసేందుకు పక్కనే ఉన్న యాంకర్ సుమ ఎంతో ప్రయత్నించారు. కానీ రష్మిక మాత్రం వినిపించుకోకుండా అసలు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడి నెటిజన్స్‌కు చిరాకు తెప్పించారు. ప్రస్తుతం రష్మిక.. ‘ఐకాన్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె అల్లు అర్జున్‌కు జోడీగా నటించనున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38i4Tf1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....