Sunday, 22 March 2020

తనీష్ ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్.. అరాచకం

‘‘గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే.. ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం’’ అంటూ యంగ్ హీరో తనీష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘‘ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’’ ట్యాగ్ లైన్‌తో తనీష్ హీరోగా వస్తున్న సినిమా ‘‘మహాప్రస్థానం’’. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కత్తి పట్టుకున్న తనీష్ శత్రువులను తుదముట్టిస్తూ వయలెంట్ లుక్‌లో కనిపించారు. భావోద్వేగం నిండిన వాయిస్ ఓవర్‌తో మొదలైన మోషన్ పోస్టర్.. ‘‘మహాప్రస్థానం’’ టైటిల్ సాంగ్ బిట్‌తో పూర్తయింది. సినిమా కథలోని లోతును, ఎమోషనల్ కిల్లర్‌గా తనీష్ పాత్రలోని ఫైర్‌ను మోషన్ పోస్టర్ చూపించింది. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ నాయికగా నటించింది. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. మంచి క్వాలిటీతో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘‘మహాప్రస్థానం’’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ అంతే వేగంగా జరుపుకుంటోందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనుల్లో ఉన్న ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ.. ‘‘ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనే ట్యాగ్ లైన్‌కు సరిగ్గా సరిపోయే సినిమా మహాప్రస్థానం. తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్‌గా తనీష్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చేయించాం. గెరిల్లా పద్ధతిలో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేశాం. ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎంఎన్ బాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WyXO7r

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....