Saturday, 21 March 2020

కరోనా వైరస్ ఎఫెక్ట్... ఇంట్లో బన్నీ ఏం చేస్తున్నాడో తెలుసా?

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీంతో చాలామంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అటు సినీ పరిశ్రమ కూడా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్ అంటూ.. అనేక ప్రాంతాలకు బిజి బిజీగా తిరిగిన సినీ తారలు అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అందరూ కరోనాపై అవగాహన కల్పిస్తూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. షూటింగ్స్ ఏం లేకపోవడంతో హ్యాపీగా ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబసభ్యులతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన బామ్మతో ఆనందంగా గడుపుతున్నాడు. దివంగత సినీ నటుడు అల్లు రామలింగయ్య భార్య బన్నీకు నాయనమ్మ అవుతారు. దీంతో ఆమెతో కలిసి బన్నీ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో మనవడికి బామ్మ ఆప్యాయంగా ముద్దు పెడుతున్నారు. వీరిద్దరి ఫొటోను ఆయన భార్య స్నేహ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రియమైన వ్యక్తులతో క్వారంటైన్ లైఫ్ గడపడం మంచి అనుభూతి అని ఆమె పేర్కొంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ ఫోటో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ హీరో హీరోయిన్లు అంతా హ్యాపీగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఏం చేస్తున్నామన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ అభిమానులకు షేర్ చేస్తున్నారు. ఇటీవలే వరుణ్ తేజ, అల్లు శిరీష్ జిమ్ బంద్ కావడంతో ఇంట్లోనే జిమ్ చేస్తున్నామంటూ వీడియోలు పోస్టుల పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vCQdd2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....