Friday, 6 March 2020

ప్రదీప్ ఆమెతో డేటింగ్ చేసాడన్న దర్శకుడు.. స్పందించిన నటి

బుల్లితెర రారాజు షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు దర్శకుడు శ్రీరామోజు సునిశిత్. ప్రదీప్‌కి హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఎఫైర్ ఉందని, తన మాటపై నమ్మకం లేకపోతే అతను చేసిన మెసేజ్‌లు చెక్ చేసుకోండని అన్నాడు. అంతేకాద గతేడాది ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ అనే ప్రోగ్రామ్‌ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జ్ఞానేశ్వరి అనే నటి విజేతగా నిలిచింది. అయితే కేవలం షోలో భాగంగానే ప్రదీప్, జ్ఞానేశ్వరిలకు పెళ్లి చూపులు జరిగాయే తప్ప నిజంగా కాదు. కానీ ప్రదీప్ మాత్రం జ్ఞానేశ్వరితో డేటింగ్ చేసాడని సునిశిత్ ఆరోపించారు. దీని గురించి తాజాగా జ్ఞానేశ్వరి ఓ సందర్భంలో మాట్లాడుతూ రియాక్ట్ అయ్యారు. ‘నాకు అసలు సినిమాలు, టీవీ షోలపై అస్సలు ఐడియా లేదు. జీవితంలో ఏం చేసైనా ఎంట్రప్రెన్యూర్ అవ్వాలన్నది నా ఆశ. అందుకే ఓ ఎంఎన్‌సీలో జాబ్ సంపాదించాను. ఆ తర్వాత ఎంబీఏ చేద్దామనుకుంటుంటే.. నా కొలీగ్ ఓ షార్ట్ ఫిలిం తీస్తానన్నాడు. టైంపాస్ కోసం నేను అందులో యాక్ట్ చేసాను. అలా సినిమాల్లోకి వచ్చేసాను. పెళ్లి చూపులు షో కూడా అలాగే చేసేసాను. పబ్లిక్‌గా మేం ఏం చేసినా ఇక జనాల్లో గుసగుసలకు అడ్డు ఉండదు. అదీకాకుండా ప్రదీప్ సౌతిండియాలోనే మోస్ట్ పాపులర్. కాబట్టి ఇక ఆయన ఏం చేసినా వైరలే. అందుకే నేను, ఆయన డేటింగ్‌లో ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు' READ ALSO: ' ప్రజలకు తెలిసింది తెలీనిదీ అన్నీ కలిపి ఏవేవో కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి వార్తలు వస్తాయని నేను ముందు నుంచీ ప్రిపేర్ అయి ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అన్నీ 99 శాతం అబద్ధమే ఉంటాయి. నాకైతే ఈ కామెంట్స్ చేసేవాళ్లను చూసి కోపం అయితే రాలేదు. ఎందుకంటే వారికి చెప్పి చెప్పి ఇక నేనే పట్టించుకోవడం మానేసా. ఆ కార్యక్రమంలో జరిగింది పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి చూపులకు, పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ రెండిటికి మధ్య ఇంకా చాలా జర్నీ ఉంటుంది. కాబట్టి నా గురించి ప్రదీప్ గురించి ఎవరు ఏమని అడిగినా కూడా వెయిట్ అండ్ సీ అని చెప్తుంటాను’ అని వెల్లడించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wAfXHi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....