Saturday, 21 March 2020

చిరంజీవి ‘ఆచార్య’లో హీరోయిన్ ఫిక్స్... చందమామకే ఛాన్స్ ?

చిరంజీవి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గతేడాది ‘సైరా’ సినమా తీసిన చిరు... ఈ ఏడాది ‘ఆచార్య’గా అభిమానుల ముందుకు వస్తున్నారు. సామాజిక కోణంలో ఈ సినిమా తెరకెక్కుతంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బయటకొచ్చిన చిరు లుక్ కూడా ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్నారు. అయితే.. అంతా ఓకే అయినా... సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఓ మగ్గురు హీరోయిన్లు పేర్లు వినిపించాయి. ఆ ముగ్గురు కూడా అంతుకుముందు చిరుతో కలిసి నటించిన ముద్దుగుమ్మలే. ముందుగా త్రిష పేరు వినిపించింది. అయతే ఈ భామ సినిమాలో నటించడం లేదని తేల్చేసింది. క్రియేటివ్ డిఫరెన్సస్ కారణంగా చిరు సార్ సినిమా నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించింది. మరో మంచి ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపింది. ఆ తర్వాత అనుష్క పేరు కూడా అనుకున్నారు. అనుష్క కూడా చిరంజీవితో కలిసి నటించడానికి సుముఖంగా ఉందన్న వార్తలు టాలీవుడ్‌‌లో బాగానే వినిపించాయి. ఇప్పుడు కాజల్ పేరే ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో కాజల్‌కు మళ్లీ మంచి టైమ్ వచ్చినట్లైంది. ఈ మధ్యకాలంలో కాజల్‌కు హిట్ సినిమా ఒక్కటి లేదు. తన పదేళ్ల కెరీర్‌లో అగ్ర హీరోల అందరితో జోడీ కట్టిన కాజల్.. ఇప్పటికీ అంతే జోరుగా సాగుతోంది. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుఇతున్న క్రేజీ ప్రాజెక్టు 'ఆచార్య'లో కాజల్ కన్‌ఫామ్‌ అయినట్లు సమాచారం. 'ఖైదీ నెంబర్ 150'లో మెగాస్టార్‌తో చిందేసిన ఈ అమ్మడు.. మరోసారి చిరుతో స్టెప్పులేయనుంది. చివరికి మూవీ యూనిట్ కాజల్‌నే ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకోసం రామ్ చరణ్‌ను అనుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qzts0N

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....