‘రాహు’ మూవీ హీరోయిన్ కృతి గార్గ్ ఒక అజ్ఞాత వ్యక్తి ట్రాప్‌లో పడిపోయారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కృతి గార్గ్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేశాడట. ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేయాలని ఆమెను నమ్మించాడట. అంతేకాకుండా స్టోరీ వినడానికి ముంబైకి రమ్మని ఆమెను ఆహ్వానించాడట. ఇదంతా నిజం అనుకొని కృతి గార్గ్ ముంబై బయలుదేరి వెళ్లారని.. అయితే, ముంబై వెళ్లిన ఆమె ఫోన్ నంబర్ సోమవారం ఉదయం నుంచి కలవడం లేదని ‘రాహు’ దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TcJuiY
No comments:
Post a Comment