Friday, 6 March 2020

వారసుడ్ని పక్కనబెట్టిన అల్లు అరవింద్.. బయటివారితోనే సినిమాలు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం యువ హీరోలతో చక్కని స్క్రిప్ట్స్ ఎంపిక చేసి వారితో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ, నిఖిల్‌ గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి రాబోతున్న రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అల్లు రెండో వారసుడు శిరీష్‌కు మాత్రం సరైన స్క్రిప్ట్ దొరకడంలేదా? ‘ఏబీసీడీ’ సినిమాతో 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ ఫ్యాన్స్‌ని ఉసూరుమనిపించాడు. 2017లో వచ్చిన ‘క్షణం’ కూడా డిజాస్టర్ అనిపించుకుంది. దాంతో సరైన హిట్ కొట్టాలని, చక్కటి స్క్రిప్ట్ ఎంచుకోవాలని శిరీష్ రెండేళ్ల ఎదురుచూసి 2019లో ‘ఏబీసీడీ’కి ఓకే చేసారు. కానీ ఈ సినిమా కూడా షాక్ ఇవ్వడంతో శిరీష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. ఈసారైన మంచి స్క్రిప్ట్‌తోనే మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేసారు. దాదాపు ఏడాది అయిపోతున్నా శిరీష్ నుంచి ఎలాంటి సినిమా ప్రకటన లేదు. మరోపక్క అతని తండ్రి అరవింద్ మాత్రం యువ హీరోలకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌కు రోజూ ఎన్నో స్క్రిప్ట్స్ వస్తుంటాయి. అందులో నుంచి ఓ మంచి స్క్రిప్ట్‌ను శిరీష్‌కు ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారని బయట టాక్. READ ALSO: అసలు అరవింద్ శిరీష్ కోసం స్క్రిప్ట్ ఎంపిక చేయలేకపోతున్నారా? లేక ఎంపిక చేసిన స్క్రిప్ట్ శిరీష్‌కి నచ్చక ఓకే చేయడంలేదా? అన్నది సందేహించాల్సిన విషయం. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు తామేంటో ప్రూవ్ చేసేసుకున్నారు. ఇప్పుడు వారంతా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ శిరీష్‌కు మాత్రం ఇంకా ఆ స్థాయిలో బ్రేక్ రాలేదు. కాగా.. ఇటీవల శిరీష్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడికో వెళుతూ కనిపించారు. బహుశా త్వరలో తన తదుపరి సినిమా గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయేమో వేచి చూడాలి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TINoz7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....