Thursday, 5 March 2020

‘నిశ్శబ్దం’ ట్రైలర్: టైటిల్ సైలెంట్... ట్రైలర్ వైలెంట్

‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. కొన్నినెలల పాటు బరువు తగ్గేందుకు అమెరికాకు కూడా వెళ్లారు. ఆ తర్వాత తన తర్వాతి సినిమా ‘నిశ్శబ్దం’ అంటూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసారు అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ అనుష్క జంటగా నటించారు. నటిం అంజలి, సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ అధికారులుగా కనిపించారు. ఈ సినిమా ట్రైలర్‌‌ను ఈరోజు రిలీజ్ చేసారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ హాంటెడ్ హౌస్ ముందు ఓ విదేశీ రిపోర్టర్ నిలబడి న్యూస్ చదువుతున్న సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఈ ఇంట్లోకి అనుష్క వెళ్లినప్పుడు ఆమెపై ఎవరో ఎటాక్ చేస్తారు. దాంతో అనుష్కను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఈ సినిమాలో అనుష్క మూగ యువతి పాత్రలో నటించారు. ఈ కేసును సుబ్బరాజు, అంజలి కలిసి డీల్ చేస్తుంటారు. అనుష్క నుంచి సమాచారం రాబట్టేందుకు అంజలి ప్రయత్నిస్తూ ఉంటుంది. READ ALSO: ఇందులో షాలిని పాండే సోనాలి అనే యువతి పాత్రలో నటించారు. అయితే ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది పూర్తిగా రివీల్ చేయలేదు. సినిమాలో జరిగే హత్యలకు ఆమే కారణమా అని సందేహం కలిగేలా చిన్న హింట్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్‌ను ఉత్కంఠభరితంగా చూపించారు. ఇక సినిమా ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. ఇందులో హాలీవుడ్ నటుడు మైఖెల్ మ్యాడ్సన్ కీలక పాత్రను పోషించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38uv3LD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....