Wednesday, 4 March 2020

నిఖిల్ సినిమాకు హాసం టైటిల్.. షూటింగ్‌లో చీఫ్ గెస్ట్‌గా అల్లు వారసురాలు

‘అర్జున్ సురవరం’ సినిమాతో గీతా ఆర్ట్స్‌లాంటి స్టార్ ప్రొడక్షన్ కంపెనీ కళ్లలో పడ్డారు హీరో . త్వరలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ నిర్మించబోయే సినిమాలో నటించనున్నారు. కాగా.. ఈ సినిమాకు ‘18 పేజెస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందిస్తున్నారు. సూర్య ప్రతాప్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తారు. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు షూటింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు వారసురాలు అల్లు అర్హ వచ్చిందట. చక్కగా పట్టులంగా వేసుకుని బుట్టబొమ్మలా తయారై వచ్చిన అర్హను వీడియో తీసి నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. 2015లో సుకుమార్ కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన 'కుమారి 21f' సినిమా సంచలన విజయం అందుకుంది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిన్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సుమారు నాలుగేళ్ల తరువాత సుకుమార్, సూర్య ప్రతాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు గీతా ఆర్ట్స్‌ ద్వారా అల్లు అరవింద్ భాగస్వామ్యం కావడం.. అర్జున్ సురవరంతో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటిస్తుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. READ ALSO: మెగా హీరోలతో పాటు బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మించి మంచి విజయాల్ని అందించిన ఘనత జిఏ 2 పిక్చర్స్ కి ఉంది. ఇప్పుడు నిఖిల్ కు సైతం అద్భుతమైన విజయం ఈ సంస్థ నుంచి వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి 2020లో నిఖిల్‌కి బాగానే కలిసొస్తోంది అని చెప్పాలి. గీతా ఆర్ట్స్‌లాంటి సంస్థతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకోవడమే కాకుండా తాను ప్రాణంగా ప్రేమించిన పల్లవిని ఏప్రిల్‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38m3bcn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....