Thursday, 19 March 2020

కామ సూత్ర హీరోయిన్‌కు కరోనా వైరస్

కరోనా వైరస్ ఎవరిని కనికరించడం లేదు. వృద్ధుల నుంచి యువత వరకు అందరికీ ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇక ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా కామ సూత్ర హీరోయిన్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. కామసూత్ర, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హీరోయిన్, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మ కరోనావైరస్ బారిన పడింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. అయితే ఆమెకు కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఇందిరా వర్మకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఇందిరాను ఈ విషయాన్ని తన ఫ్యాన్స్‌కు తెలిపింది. బుధవారం ప్రొడక్షన్‌ కు సంబంధించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. కరోనా వ్యాపిస్తున్న కారణంగా తన షో ఆగిపోయినట్టుగా తెలిపింది. అంతేకాదు కరోనా కారణంగా తాను అనారోగ్యం పాలైనట్టుగా కూడా ఆమె పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో షోస్ క్యాన్సిల్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది ఇందిరా. హాలీవుడ్‌లో రాణిస్తున్న ఇందిరా వర్మకు భారత సంతతి మూలాలు ఉన్నాయి. తండ్రి ఇండియన్ కాగా, తల్లి స్విస్ దేశస్థురాలు. 1996లో కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్, 2004లో బ్రైడ్ అండ్ ప్రిజ్యుడీస్ అనే చిత్రాల్లో నటించింది. 2014 నుంచి 2017 వరకు ప్రసారం అయిన గేమ్‌ ఆఫ్ త్రోన్స్‌ ఎపిసోడ్స్‌ లో ఎల్లారియా సాండ్ పాత్రలో మెరిసి అందర్నీ మెప్పించింది. మరోవైపు గేమ్ ఆఫ్ త్రోన్‌ లోనే నటించిన మరో నటుడు క్రిస్టోఫర్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని క్రిస్టోఫర్‌ తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలతో పాటు పలువురు హాలీవుడ్ నటులు, సినీ టెలివిజన్‌ తారలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3d9t7vH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....