Monday, 23 March 2020

పోతావ్ రా అరేయ్ పోతావ్... యాంకర్ సుమ వీడియో

లాక్ డౌన్ పాటిస్తున్న సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు...అంతా తమ షూటింగ్స్ బంద్ చేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఇక టీవీ షూటింగ్స్ కూడా బంద్ కావడంతో... ప్రముఖ యాంకర్లంతా కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ సుమ ఓ వీడియో పోస్టు చేశారు. ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా కొంతమంది పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారంటై ఆమె సీరియస్ అయ్యారు. ఏమంతా అర్జంట్ పనులు అంటూ పబ్లిక్‌ను సుమ ప్రశ్నించారు. ‘ పోతావ్ రా అరేయ్ పోతావ్’ అని చెబుతున్నా పట్టించుకోకుండా జనం బయటకు వస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. దయచేసి ఇంటికే పరిమితం అవ్వండి అని కోరుతున్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, స్వచ్ఛ కార్మికులు వారి ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి పనిచేస్తున్నారన్నారు. మిగతా వాళ్లు ఇంటికే పరిమితం అవ్వాలన్నారు సుమ. ఇక పోతే విదేశాల నుంచి వచ్చినవాళ్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారన్నారు. అలాంటివాళ్లు తమని తాము డిక్లేర్ చేసుకొని సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలన్నారు. అదే వాళ్లు భారతదేశానికి చేసిన పెద్ద ఉపకారం అవుతుందన్నారు. అలా చేస్తే.. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుందన్నారు. ప్లీజ్ స్టే ఎట్ సేఫ్... స్టే హోమ్ అని సుమ అందరిని కోరారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Uxka6L

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....