Tuesday, 3 March 2020

మాస్క్‌తో ఫ్రాన్స్ బయలుదేరిన ప్రభాస్, అక్కడ 200 మందికి కరోనా

యంగ్ రెబెల్‌స్టార్ ఫ్రాన్స్ బయలుదేరారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రభాస్ చేరుకున్నారు. ఆయన మాస్క్ వేసుకుని ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆల్రెడీ ఫ్రాన్స్‌లో 200 మందికి కరోనా సోకింది. అక్కడ ఆల్రెడీ కరోనా బారిన పడి నలుగురు చనిపోయారు కూడా. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్రాన్స్‌కు వెళ్లడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాస్త కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేవరకు షూటింగ్ వాయిదా వేసుకోవచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క చాలా మంది సెలబ్రిటీలు షూటింగ్‌లు మానుకుని ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా వైరస్ ముదురుతోందని తెలిసీ బయటికి వెళ్లడం ఎందుకని అనుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఓ షో నిమిత్తం ఇటలీ వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ కరోనా బాధితులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. READ ALSO: ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్రాన్స్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు సినిమా షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ వాయిదా వేసే బదులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఫ్రాన్స్‌లో షెడ్యూల్ త్వరగా షూట్ చేసేయాలని టీం అనుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TlaXPH

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....