Wednesday 12 February 2020

Pawan kalyan: పవర్‌స్టార్ సినిమాపై గాసిప్స్.. ఒకటి నిజమైంది!

పవర్‌స్టార్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ఫాస్ట్‌గా జరిగిపోతోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాపై చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. వాటిలో ఈ సినిమాలో సిధ్ శ్రీరామ్ ఓ పాట పాడబోతున్నారన్న విషయం కూడా ఉంది. ఇప్పుడు ఆ గాసిప్ నిజమైంది. అవును..ఈ సినిమాలో యంగ్ ట్యాలెంట్ సిధ్ శ్రీరామ్ ఓ బ్యూటిఫుల్ సాంగ్ పాడబోతున్నాడట. ఈ విషయాన్ని మరెవరో కాదు తమనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మేమిద్దరం మళ్లీ కలిసాం. ఇన్నాళ్లూ మీరు ఊమించుకున్నదంతా 99.9 శాంత నిజమే. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటను సిధ్ శ్రీరామ్ పాడబోతున్నాడు. ప్రాణం పెట్టి ఈ పాటను కంపోజ్ చేసాం. మీకు ఈ పాటను ఎప్పుడెప్పుడు వినిపిస్తానా అని ఎదురుచూస్తున్నా’’ అని వెల్లడిస్తూ సిధ్ శ్రీరామ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసారు. READ ALSO: పింక్ రీమేక్‌కు ‘లాయర్ సాబ్’, ‘వకీల్ సాబ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అక్షరాలా 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన కీలకమైన పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల కోసం ప్రగ్యా జైశ్వాల్‌, అనసూయ భరద్వాజ్‌లను ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మేలో సినిమాను రిలీజ్ చేయబోతున్నామని దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Hiv1v5

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...