Thursday 6 February 2020

MAA: చిరుకి ఆ పదవి ఇస్తే నేను ఊరుకోను: తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిని నంది అవార్డ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అదీకాకుండా ఇటీవల చిరంజీవి, నాగార్జున మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కూడా కలిసి కీలక విషయాలు చర్చించారు. అయితే చిరంజీవిని నంది అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తే తాను ఊరుకోనని అంటున్నారు ప్రముఖ నిర్మాత . ‘‘సౌత్ ఇండియా ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేయాలో చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున తలసాని శ్రీనివాస్‌ను కలిశారు. అందులో తప్పేముంది? వీరిద్దరూ కలిసి మాట్లాడితే ఏ విషయం అన్నది తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో కలిసి చర్చిస్తారు. ఇకపోతే చిరంజీవిని నంది అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తారా అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. నా ఉద్దేశంలో అయితే ఒకవేళ చిరంజీవికి ఆ అవకాశం వచ్చినా నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే చిరంజీవి గారు ఉన్న స్థాయికి ఆ గౌరవం సరిపోదు. ఒకవేళ ఆయన కమిటీ ఛైర్మన్ అయినా కూడా నేను ఆయనతో గొడవపడి మరీ తీయించేస్తాను. ఛైర్మన్ పదవికి మనలాంటి పనీ పాటా లేనోళ్లు ఉంటారు కానీ చిరంజీవిగారు సినిమాలతో బిజీగా ఉండే మనిషి. పైగా ఏమైనా సమస్యలు వస్తే చిరంజీవి మీదకే నెట్టేస్తారు’’ READ ALSO: ‘‘ఎందుకు ఈ అనవసరమైన తలనొప్పి. ఆయనకు ఏ పదవీ అవసరం లేదు. ఆయన సుప్రీం స్థాయిలో ఉన్నారు. ఈరోజు చిత్ర పరిశ్రమ కోసం ఏదైనా చేయగలిగే స్థాయిలో చిరంజీవి ఉన్నారు. అలాంటి ఆయన్ను పిలిచి ఏదన్నా పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఆయనకు అలాంటి పదవుల్లో ఉండే సమయం లేదు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాల గురించి మాట్లాడాలంటే.. మీడియా వాళ్లు ఏదో పెద్ద యుద్ధం జరిగిపోయినట్లు రాసేశారు. అవన్నీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. వాళ్లే పరిష్కరించుకుంటారు. నేను ఎవ్వరికీ సపోర్ట్ చేయడంలేదు. ఎందుకంటే నేను ‘మా’ సభ్యురాలినే కాను. పెద్ద మనిషిని అయినంత మాత్రాన వారితో మాట్లాడేసి అనవసరంగా తలదూర్చే తత్వం నాది కాదు’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S38xEy

No comments:

Post a Comment

'Growth Of Cheese Market In India Is Exponential'

'Only 20 per cent of families in India buy cheese twice once a year.' from rediff Top Interviews https://ift.tt/CgFUkP9