Monday 10 February 2020

HIT: ‘హిట్’ అంటే.. టైటిల్ వెనుక అసలు కథ ఇది!

నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని.. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘అ!’ అనే ప్రయోగాత్మక సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన బ్యానర్‌లో రెండో సినిమాగా ‘హిట్’‌ను నిర్మిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్‌సేన్ హీరోగా ఈ ‘హిట్’ సినిమా తెరకెక్కుతోంది. శైలేష్ కోనేరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘హిట్’ టీజర్ సినిమాపై అంచనాలను ఏర్పరిచింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఇటు నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. దీనిలో భాగంగా అసలు ‘హిట్’ (HIT) అంటే ఏమిటో తెలిపే వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇంతకీ హిట్ అంటే.. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం. అంటే హత్యోదంతాల్లో జోక్యం చేసుకునే బృందమన్నమాట. Also Read: ఈ ప్రోమోను బట్టి చూస్తే ఇది హత్యకేసును ఛేదించే పోలీసు అధికారి కథ. పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్‌ సేన్ నటించారు. ‘‘ప్రీతి లాస్ట్‌గా 6 పీఎంకు ఓఆర్ఆర్ మీద కనబడింది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే మోటివ్ ఇంకా మాకు తెలీదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. తదుపరి వివరాలు హెచ్ఐటీ అధికారికంగా ప్రకటిస్తుంది. హెచ్ఐటీ అంటే హోమిసైడ్ ఇంర్వెన్షన్ టీం’’ అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగు ఈ ప్రోమోలో హైలైట్. కాగా, ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్‌గా రుహాని శర్మ నటించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్. గ్యారీ బీహెచ్ ఎడిటర్. నబ స్టంట్ కొరియోగ్రాఫర్. నాని సమర్పిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంతి తిపిర్నేని నిర్మాత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UHNcCA

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR