Saturday 22 February 2020

ధనుష్ పోస్టర్.. బండబూతులు తిడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ అన్నింటిలోనూ లేటే.. ఇక పెళ్లి విషయం ఆయన పర్సనల్ కాబట్టి దాన్ని పక్కనపెడితే.. ఆయన సినిమాల్లోకి రావడమూ లేట్ చేశారు.. వచ్చాక ఒక్కో సినిమాకి సినిమాకి రెండు నుండి ఐదేళ్లు వరకూ సమయం తీసుకుంటున్నారు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ టైం తీసుకున్నా పర్లేదు.. ఫ్యాన్స్‌ జాతీయ స్థాయిలో కాలర్ ఎగరేసే సినిమా ఇవ్వడంతో ఎన్నేళ్లు సినిమా చేశాం అన్నది ముఖ్యం కాదు రికార్డ్స్ బద్దలు కొట్టామా లేదా అన్నదే ముఖ్యం అని ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం రెండున్నరేళ్లు ఎదురు చూశారు ఆయన ఫ్యాన్స్. అయితే ‘సాహో’ చిత్రం తీవ్రంగా నిరాశపర్చడంతో ఆయన నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ 20 మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్న విషయం తెలిసింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ లవర్‌ బాయ్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలో యూవీ క్రియేషన్స్ వెనుకబడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అత్త తిట్టినందుకు కాదు.. తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టుగా.. ప్రభాస్ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వకపోతే.. ఇవ్వకపోయారు.. తమిళ హీరో ధనుష్ కొత్త సినిమా 'జగమే తంత్రం' పోస్టర్‌ని విడుదల చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. ఒకవైపు తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే.. అది ఇవ్వాల్సిందే పోయి.. పొరుగు హీరో పోస్టర్ కావాల్సి వచ్చిందా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ధనుష్ 'జగమే తంత్రం’ పోస్టర్ కింద కామెంట్ల రూపంలో యూవీ క్రియేషన్స్‌ని బండబూతులు తిడుతూ ట్వీట్లు చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వారి ఆగ్రహం ఏ రేంజ్‌లో ఉందో ఈ ట్వీట్స్ చూస్తే అర్థమైపోతుంది.. వాటిపై ఓ లుక్కేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HHLmK2

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz