Saturday 15 February 2020

విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం.. గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్

హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్‌కు దోహదపడింది. మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌‌లో పోటీపడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ పాల్గొనేందుకు కావాల్సిన ఫీజ్ కోసం ఇబ్బంది పడ్డాడు. పేద కుటుంబానికి చెందిన గణేష్‌ది మ్యాచ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి. ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజ్ రూ. 24 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఫిబ్రవరి 1న ఆ చెక్‌ను దేవరకొండ గోవర్ధన్ రావు క్రీడాకారుడు గణేష్‌కు అందజేశారు. ఆ సహాయంతో న్యూడిల్లీ వెళ్లిన గణేష్ ఈ నెల 13న జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో విజయ్ చేసిన ఆ సహాయం వల్లే తాను ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయగలిగి, గోల్డ్ మెడల్ సాధించానని గణేష్ ఎంబారి సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిఫరెంట్ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే, బొగ్గు గనిలో కార్మికుడిగా విజయ్ చేసిన సీనయ్య పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలిచింది. అలాగే, సీనయ్య భార్య సువర్ణగా ఐశ్వర్య రాజేష్ అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HsMelL

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...