2019 వరకు యంగ్ హీరో నితిన్‌కు సరైన హిట్ లేదు. అలాంటి టైంలో దర్శకుడు వెంకీ కుడుముల ఓ చక్కటి కథ చెప్పారు. అదే ‘’. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా.. అంటూ తొలిరోజే నెటిజన్స్ రివ్యూలు ఇచ్చేసారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ రాబట్టిన కలెక్షన్స్ చూస్తే విజిల్ పడాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఓపెనింగ్స్ నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పాలి. మహాశివరాత్రి కావడంతో సెలవు రావడం, పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ లేకపోవడంతో ‘భీష్మ’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకున్నాడు. అదీకాకుండా సినిమా మంచి టాక్ అందుకుంటుండడంతో ఆదివారం వరకు థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించారు. బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా విలన్ పాత్రను పోషించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించారు. మొత్తానికి 2020లో నితిన్ తొలి హిట్ ఖాతాలో వేసుకున్నారు. పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం.. ప్రచార కార్యక్రమాలను కూడా బాగా నిర్వహించడంతో ‘భీష్మ’పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ అంచనాలను ‘భీష్మ’ అందుకుందని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. యూఎస్‌లో గురువారమే ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. READ ALSO: అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని, కామెడీ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. ‘భీష్మ’ ఫస్టాఫ్ అదిరిపోయిందట. మరో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ రేంజ్ కామెడీ అట. ఫస్టాఫ్ అంతా కడుపుబ్బా నవ్వించేశారట. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఫస్టాఫ్ అంతా టైమ్ పాస్ స్టఫ్ అని కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదా సరదా సన్నివేశాలతో దర్శకుడు లాగించేశారట. ఇక నితిన్ క్యారెక్టరైజేషన్ అయితే సూపర్ అని అంటున్నారు. చాలా రోజుల తర్వాత నితిన్‌కు పర్ఫెక్ట్ రోల్ దొరికిందని చెబుతున్నారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HHKuoT
No comments:
Post a Comment