అనుష్క పెళ్లి ప్రస్తావన వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్‌తో ఆమెకు ఉన్న సంబంధం. నిజానికి వీళ్లిద్దరి మధ్య ఉన్నది స్నేహబంధమే అయినా ఇప్పటికీ చాలా మంది వారిద్దరి మధ్య ప్రేమబంధం ఉందని వాదిస్తుంటారు. తనకు.. లేదంటే అనుష్కకు పెళ్లయితే తప్ప ఈ రూమర్లు ఆగవని ప్రభాస్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే, ఈ రూమర్లకు చెక్ పెట్టే మరో కొత్త రూమర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనుష్క పెళ్లిచేసుకోబుతున్నారని తెలుగు, కన్నడ మీడియాలో శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. మరి, ఈ వార్తలో నిజముందా? తాజా రూమర్ ప్రకారం నార్త్ ఇండియాకు చెందిన ప్రస్తుత టీమిండియా క్రికెటర్‌ను అనుష్క పెళ్లిచేసుకోబుతున్నారు. ప్రస్తుతం తనకున్న కమిట్‌మెంట్స్‌ను పూర్తిచేసుకున్న తరవాత అనుష్క పెళ్లిపీటలు ఎక్కుతారు. అయితే, ఆ క్రికెటర్ ఎవరన్నది మాత్రం ఎవ్వరికీ తెలీదు. నిజానికి ప్రస్తుత ఇండియన్ క్రికెట్ టీంలో అనుష్క ఏజ్ గ్రూప్‌తో మ్యాచ్ అయ్యే క్రికెటర్ ఒక్కరు కూడా లేరు. పోనీ యంగ్ క్రికెటర్ ఎవరితోనైనా ఆమె డేటింగ్‌లో ఉన్నారా? అంటే అదీలేదు. మరి అలాంటప్పుడు పెద్దలు చిన్న కుర్రాడిని ఇచ్చి అనుష్కకు ఎందుకు పెళ్లి చేస్తారు. కాబట్టి, ప్రస్తుత టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి వార్తలో నిజంలేనట్టే. Also Read: ఒక వేళ అనుష్క పెళ్లి గురించి మీడియాలో వచ్చిన కథనాలు నిజమే అయినా వరుడు కచ్చితంగా ప్రస్తుత టీమిండియా క్రికెటర్ అయితే అయ్యుండడు. బహుశా టీమిండియా మాజీ క్రికెటర్ అయ్యుండొచ్చు. చూద్దాం దీనిపై అనుష్క స్పందిస్తారో లేదో! ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క మాట్లాడలేని అమ్మాయి పాత్రలో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, మలయాళం భాషల్లో ఏప్రిల్ 2న విడుదలవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3boV15I
No comments:
Post a Comment