Thursday 13 February 2020

నా సినిమాలు చూస్తే నాకే సిగ్గేస్తోంది: దర్శకుడి వ్యాఖ్యలు

తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు దర్శకుడు మిస్కిన్. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘సైకో’ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ తాను తీసే సినిమాలు చూస్తే తనకే సిగ్గేస్తోందని అంటున్నారు మిస్కిన్. గురువారం చెన్నైలో ‘భారం’ అనే సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు గెస్ట్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇటీవల భారం సినిమా చూసాను. సినిమా చూసాక నన్ను ఎవరో చెప్పుతో కొట్టినట్లు అనిపించింది. ఈ సినిమా చూసాక నేను తీసిన సినిమాలపై నాకే సిగ్గుగా ఉంది. నేను భారం లాంటి సినిమాలు తీయలేకపోయానేనని ఫీలయ్యాను. ప్రతీ ఒక్కరు బారమ్ సినిమాను తమ తల్లిదండ్రులతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను. సినిమా చూసాక తల్లిదండ్రులపై ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ సినిమా నాకు ఎంత నచ్చిందంటే.. నేను ఓ నిర్ణయానికి వచ్చాను. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారం సినిమా పోస్టర్లను నేనే వెళ్లి స్వయంగా గోడలపై అతికించి ప్రమోట్ చేస్తాను’ అని వెల్లడించారు. READ ALSO: భారం సినిమాను ప్రియా కృష్ణస్వామి తెరకెక్కించారు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. మొన్న జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో అవార్డు అందుకున్న ఏకైక తమిళ సినిమా ఇదే కావడం విశేషం. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. అందుకే ఈ సినిమా గొప్పతనం గురించి వివరిస్తూ మిస్కిన్ అంత ఎమోషనల్ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V1gKv9

No comments:

Post a Comment

'I'm Being Used As A Potato For 25 Years'

'...be it a comedy, thriller or a love story.' from rediff Top Interviews https://ift.tt/5orx1p9