Wednesday 12 February 2020

దేశం వదిలి వెళ్లిపోతానంటున్న మాధవీలత, బీజేపీ అక్కకు భయమా..!

దేశం అంతా కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిందంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సినీ నటి, బీజేపీ నేత మాధవీలత. మొన్న డిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దాని గురించి మాట్లాడుతూ.. మరో మూడు శాతం మంది ఓట్లు వేసి ఉంటే బీజేపీ గెలిచేదంటూ బాధపడ్డారు. అంతేకాదు ఈ దేశమంతా ఫేక్ ప్రజలే ఉన్నారట. ‘‘నాకు దేశం విడిచి ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలని ఉంది. ప్రతి చోటా మోసం, ఫేక్ ప్రజలు, ఫ్రాడ్ ప్రజలు, ప్లాస్టిక్ నవ్వులు, అవసరాలు, అవమానాలు తప్ప ఇంకేమీ లేవు. అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎందుకు ప్రజలు ప్లాస్టిక్‌లా మారిపోయారు?’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. మాధవిపై సెటైర్లు వేస్తున్నారు. ‘బీజేపీ అక్కకు ధైర్యం లేకపోవడం ఏంటి? ఇంతకంటే మంచి ప్రదేశం ఉంటే తప్పకుండా వెళ్లండి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం గురించి మాట్లాడుతూ.. ‘AAP భారీ విజయంతో టిఆర్ఎస్, టిఎంసి, డిఎంకె వంటి పార్టీలన్నీ విఫలమైన ఫ్రంట్ ప్రతిపాదనను మళ్లీ తెరమీదకు తెస్తున్నాయి. కానీ ఈ పార్టీలన్నిటికీ ఉన్న స్వార్థపూరిత అధికార దాహం వల్ల, అవి ఎన్నికల్లో ఒక్కటిగా ఎప్పటికీ కలవలేవు అని బీజేపీ గట్టిగా భావిస్తోంది. ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావాలంటే, వాటిని కూడగట్టడానికి ఒక జాతీయ పార్టీ కావాలి. కానీ, కాంగ్రెస్ అంపశయ్య మీద చావుబతుకుల్లో ఉంది. ఆ పార్టీ నాయకులకు గౌరవం లేదు’’ READ ALSO: ‘‘. ప్రాంతీయ పార్టీల కూటమిని నడిపించే శక్తీ లేదు. కుటుంబ రాజకీయ వ్యాపారాలు చేస్తూ పండిపోయిన రాజకీయ పార్టీలతోనూ, ముదురు తెలివితో వ్యవహరించే ప్రాంతీయ పార్టీలతోనే కలసి పనిచేయగలిగే యుక్తీ, శక్తీ, అనుభవం ఉన్న పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కాదు. ప్రస్తుత భారత రాజకీయాల్లో క్రియాశీల ప్రాంతీయ పార్టీల కూటమి లేదా ఫ్రంట్ సాధ్యపడుతుందని బీజేపీ విశ్వసించడం లేదు. కాకపోతే, మాపై జాతీయ స్థాయిలో మరొకసారి భారీ ఎత్తున వ్యతిరేక ప్రచారానికి మాత్రం ప్రయత్నిస్తారు. మరో మూడు శాతం ఓట్లు పడి ఉంటే బీజేపీ గెలిచుండేది. డిల్లీలో చాలా మంది ప్రజలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. దేశాన్ని నడిపించే నాయకుడిని ఎన్నుకోలేనప్పుడు ఈ ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థంకావడంలేదు’’ అంటూ బాధపడ్డారు మాధవి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vwMNbe

No comments:

Post a Comment

Rekha: 'I Welcome Pain. It Helps Me Grow'

'I don't know of any happy moment in my life which has helped me to grow, whereas pain has always been a means to evolve.' fro...