Saturday, 22 February 2020

‘అల ’.. మిస్ అయ్యారా? ఇకపై ఇంట్లోనే చూడొచ్చు ఇలా..!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టించింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఈ సినిమా చూసేసే ఉంటారు. ఒకవేళ చూడని వారు ఎవరైనా ఉంటే.. మీరు ఇక థియేటర్ వరకు వెళ్లా్ల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ప్రశాంతంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అదెలాగంటారా.. జెమిని టీవీకి చెందిన సన్ నెక్ట్స్ అనే ఓటీటీ యాప్‌‌లో ఈ సినిమా రాబోతోంది. ఈ నెల 26 నుంచి సినిమాను డౌన్‌లోడ్ చేసుకుని చూడొచ్చు. అయితే ముందు సినిమాను అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కాస్త త్వరగా ప్రసారం చేసేస్తే మంచి వ్యూస్‌తో లాభాలు వస్తాయని భావించి ఈ నెలలోనే ప్రసారం చేసేస్తున్నారు. బన్నీ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్స్ సాధించిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ‘బాహుబలి’ కలెక్షన్స్‌ను బీట్ చేసిందని కూడా టాక్. ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చేసాక ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా నెల రోజుల్లోనే థియేటర్ల నుంచి తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంల వల్ల పైరసీ కూడా తగ్గుతుందని అనుకున్నారు కానీ అలాంటి మార్పు వచ్చినట్లు కనిపించడంలేదు. ఏదైతే ఏముంది.. మరో నాలుగు రోజుల్లో ‘అల వైకుంఠపురములో’ సినిమా వచ్చేస్తోంది.. హ్యాపీగా ఇంట్లో కూర్చుని చూసేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T1M8XA

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...